Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని డిజాస్టర్ సినిమాలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించాడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. 2014లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ దాదాపు 11 ఏళ్లపాటు ఏ పదవి లేకుండా పార్టీను యాక్టివ్ గా నడిపించారు. ఈ ఈ 11 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో ఈ పార్టీని బిజెపి పార్టీలో కలిపేయడం బెటర్ అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇంకొందరు ఈ పార్టీ కేవలం చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే స్థాపించారు అంటూ విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నిటిని పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు.
ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఎంత సక్సెస్ అయ్యారు ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలలో ఎంతోమంది హీరోలను కలుపుకుంటూ వెళ్లారు. ప్రతి హీరోను చాలా గౌరవంగా మాట్లాడారు. చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం రోజురోజుకీ ముదిరిపోయింది. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. పుష్ప సినిమా గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా చాలా సందర్భాల్లో మెగా ఫ్యామిలీ గురించి పవన్ కళ్యాణ్ గురించి సంచలమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. అందరి హీరోలకి థాంక్స్ చెప్తూ అల్లు అర్జున్ అభిమానులను కూడా మరోసారి ప్రస్తావించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది అని చెప్పుకొచ్చాడు. తనను ఇంట్లో పేరెంట్స్ చంటి సినిమాలో మీనా లాగా పెంచారు అంటూ పవన్ కళ్యాణ్ రీవిల్ చేశాడు. చంటి సినిమాలో మీనా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అసలు బయట ప్రపంచం తెలియకుండా చంటి సినిమాలో మీనా పాత్ర పెరుగుతుంది. అచ్చం పవన్ కళ్యాణ్ కూడా అలానే పెరిగాడట. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రతిసారి ఓజి సినిమా గురించి అభిమానులు అరవడం అనేది కామన్ గా జరిగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు.నా సినిమాల పేర్లు ఎందుకు అరవద్దు అంటానంటే, ఏదో తక్కువ చెయ్యాలి అని కాదు. 463 మంది జనసైనికులు సినిమాల కోసం కాదు సిద్ధాంతాల కోసం పాటు పడుతూ చనిపోయారు. వారి గౌరవం మనం కాపాడాలి. అంటూ అభిమానులకు అర్థమయ్యేలా క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
Also read : Pawan Kalyan: 11 ఏళ్లు రాజకీయాల్లో లేకుంటే పవన్ కళ్యాణ్ ఆస్కార్ కొట్టేవారా.?