Pawan Kalyan: మార్చి 14కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా తర్వాత జనసేన అనే ఒక పార్టీని స్థాపించి అప్పట్లో సంచలనం సృష్టించారు. పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించినప్పుడు మొదటి స్పీచ్ ఎంత పవర్ఫుల్గా ఇచ్చారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో మరోసారి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. పవన్ కు మాట్లాడిన మాటలు కొందరికి అసహనాన్ని కూడా కలిగించవచ్చు. ముఖ్యంగా తమిళ్ హిందీ వివాదంలో పవన్ కళ్యాణ్ వేలు పెట్టారని చెప్పాలి. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారంటే..
మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, అన్ని దేశ్ భాషలే కదా. తమిళనాడులో హిందీ రాకూడదు రాకూడదు అంటారు. నాకు అప్పుడు మనసులో ఒకటి అనిపించింది. అప్పుడు తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులు ఏమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి కావాలి, బీహార్ నుంచి కావాలి పని హిందీ మాకు వద్దంటే ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. పనిచేసే వాళ్లంతా మనకి బీహార్ నుంచి రావాలి హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అంటూ పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. అందుకని భాషల్ని ద్వేషించవలసిన అవసరం లేదు అంటూ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ మాటలు వింటుంటే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మరోసారి గుర్తొచ్చింది. ఎందుకంటే ఇదే మాదిరిగా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా ఉంటాయి.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యంగా హిందువులందరికీ నేను చెబుతున్నాను. మీరు ముస్లిమ్స్ ని చూసి నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముస్లింస్ అంతా అరబిక్ లోనే మంత్రాలు చదువుతారు ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు దానికి ఏమిటి సమస్య, తమిళంలో చదవాలా.? అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆ విధివిధానాలు ఉన్నాయి వాటిని వదిలేసేయండి ఆ జోలికి వెళ్ళకండి అంటూ పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ మాటలపై తమిళ రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.రూపే సింబల్ ని తమిళ్ లోకి మార్చారు ఇప్పుడు తెలుగులోకి మార్చాలి కన్నడలోకి మార్చాలి ఎందుకు అలాగా మనం అందరం భారతీయులం అంటూ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించిన భాష పరిజ్ఞాన విషయానికి వస్తే తమిళంలో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి పట్టు ఉంది. మాట్లాడితే ఉత్తర దక్షిణ భారతదేశం అంటూ ఉంటారు. ఇలాంటి మాటలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి అంటూ పవన్ కళ్యాణ్ వాపోయారు.
Also Read: అల్లు అర్జున్ గురించి పవన్ ప్రస్తావన.. ‘చంటీ’లో మీనాల పెంచారంటూ కామెంట్స్