E-Paper
Advertisement

Time Deposit Vs Fixed Deposit: పోస్టాఫీస్ డిపాజిట్ vs బ్యాంక్ ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఏది బెటర్,

Time Deposit Vs Fixed Deposit: పోస్టాఫీస్ డిపాజిట్ vs బ్యాంక్ ఎఫ్‌డీ.. ఈ రెండింటిలో ఏది బెటర్,
Advertisement

Time Deposit Vs Fixed Deposit: పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్-బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఈ రెండూ ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలు. హామీతో కూడిన రాబడిని కోరుకునే సంప్రదాయ పెట్టుబడిదారులకు ఇది రైట్ ఛాయిస్. స్థిరమైన రాబడి, మూలధన రక్షణను అందిస్తాయి. కాకపోతే భద్రత, వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాల విషయంలో విభిన్నంగా ఉంటాయి.

పోస్టాఫీస్ డిపాజిట్ vs బ్యాంక్ ఎఫ్‌డీ పథకాలు

Advertisement

వీటి ఎంపిక చాలావరకు పెట్టుబడిదారుడి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. గరిష్ట భద్రతను కోరుకునే వారు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్‌ను ఇష్టపడతారు. అధిక రాబడి, ఎక్కువ సౌలభ్యాన్ని కోరుకునే బ్యాంక్ ఎఫ్‌డీల వైపు మొగ్గు చూపుతారు. తొలుత పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ల విషయానికి వద్దాం.

కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. అసలు, వడ్డీ రెండింటికీ హామీ ఉంటుంది. అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా నిలుస్తుంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో ఐదేళ్ల వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది. మూడేళ్లకు 7.10, రెండేళ్లకు 7 శాతం, ఏడాదికి 6.90 శాతం వడ్డీ వస్తుంది.

Advertisement

ఏ పథకం బెస్ట్ ఛాయిస్.. కాకపోతే నాలుగైదు అంశాల్లో తేడాలు

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు ఏడాది నుంచి మొదలవుతుంది. ఏడాది నుంచి ఐదేళ్ల వరకు మాత్రమే కాలపరిమితి అందుబాటులో ఉంటుంది.  మొదటి ఆరు నెలల కాలంలో గడువుకు ముందు డబ్బు ఉపసంహరించు కోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆరు నెలల తర్వాత మెచ్యూరిటీకి ముందు ఖాతాను క్లోజ్ చేస్తే తక్కువ వడ్డీ చెల్లించబడుతుంది, ఫలితంగా సామాన్యుడు వేసుకున్న అంచనాలకు రాబడి తగ్గుతుంది.

బ్యాంక్ FDలు గణనీయంగా సౌలభ్యాన్ని అందిస్తాయి. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు డిపాజిట్ కాలపరిమితులను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. బ్యాంక్ FDలను మెచ్యూరిటీకి ముందు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎఫ్‌డీలను  క్లోజ్ చేయవచ్చు.

ALSO READ: వారెవ్వా పసిడి.. దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఖుషీ ఖుషీ!

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లలో అలా ఉండదు. బ్యాంకులు వడ్డీ రేటుపై సుమారు 0.5 నుండి 1 శాతం వరకు జరిమానా విధిస్తాయి. చాలా బ్యాంకులు డిపాజిటర్లు తమ FDలను రద్దు చేయకుండానే వాటిపై రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తాయి.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్, బ్యాంకులోని ఐదేళ్ల టాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రూ. 1.5 లక్షల వరకు మినహాయింపులు వస్తుంది. సీనియర్ సిటిజన్లు బ్యాంకు FDలతో అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సాధారణ FD రేటుపై అదనంగా 0.25 నుండి 0.75 వరకు వడ్డీని అదనంగా ఇస్తుంటాయి.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లకు ఎలాంటి అదనంగా వడ్డీ రేట్లు పెంచవు. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే ముందు వడ్డీ రేట్లనే కాకుండా డిపాజిట్ బీమా, అవసరాలు, పన్ను ప్రభావాలు, పెట్టుబడి కాలపరిమితి వంటి అంశాలను పోల్చి చూడాలని ఆర్థిక ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు. రెండు ఎంపికలోనూ పెట్టుబడులు పెట్టడం వల్ల భద్రతతో పాటు రాబడి సామర్థ్యాన్ని కూడా సమతుల్యం చేసుకోవడానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు.

Related News

బంగారం, రియల్ ఎస్టేట్, ఎఫ్‌డీలపై తగ్గిపోతున్న ఆసక్తి.. భారతీయులు పెట్టుబడి కోసం ఎంచుకుంటున్న కొత్త మార్గాలివే

దిగొస్తున్న పసిడి-వెండి ధరలు, రూ. 3 వేలు పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌-డీజిల్-ఏటీఎఫ్‌‌లపై ట్యాక్స్ తగ్గింపు, అర్థరాత్రి నుంచి అమలు

దిగొచ్చిన పసిడి ధర.. వినియోగదారుల్లో ఒక్కటే ఆనందం, మార్కెట్లో ధరల మాటేంటి?

ఓలా, ఊబర్‌కు షాక్.. క్యాబ్ బుకింగ్‌ కోసం టిప్స్ చెల్లించాల్సిన అవసరం లేదు..

రూ.37వేల సాలరీ నుంచి రూ.2.2 కోట్ల ప్యాకేజీ.. టెకీ కెరీర్ స్టోరీ వైరల్

చంద్రశేఖరన్ వారసుడు ఆయనే? టాటా సన్స్ ఉక్కుమనిషి టీవీ నరేంద్రన్

గిగ్ వర్కర్ల భవిష్యత్‌కు భరోసా.. కేవలం రూ.99తో పెన్షన్!

Big Stories

Advertisement
×