E-Paper
Advertisement

భూమిలో పండుతున్న బంగారం.. వరంగల్ జిల్లాలోని ఆ ఆరు ఎకరాల మిస్టరీ ఏంటి?

భూమిలో పండుతున్న బంగారం.. వరంగల్ జిల్లాలోని ఆ ఆరు ఎకరాల మిస్టరీ ఏంటి?
Advertisement

Warangal Gold: తెలంగాణలోని ఒక సాధారణ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. “ఆ భూమిలో బంగారం పండుతోంది!” అవును, మీరు విన్నది నిజమే. ఎకరా భూమి కౌలుకు దొరికితే చాలు మహాప్రసాదం అనుకునే రోజుల్లో.. ఒక నిర్దిష్టమైన ఆరు ఎకరాల పొలం కోసం పోటీ పడుతూ, “మాకంటే మాకు కౌలుకివ్వండి” అంటూ రైతులు యజమాని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఆ భూమిలో అంతటి అద్భుతం ఏం జరిగింది? అక్కడ నిజంగానే బంగారం దొరుకుతుందా? అనే ఆసక్తికర విశేషాలు..

అసలేం జరిగిందంటే..?
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఒక ఆరు ఎకరాల పొలమే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈర్యతండాకు చెందిన ఒక రైతు దీనిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల జూన్ 24వ తేదీన ఆ పొలంలో మహిళా కూలీలు కలుపు తీస్తుండగా.. అనూహ్యంగా వారికి కొన్ని పురాతన బంగారు ఆభరణాలు లభించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భూ యజమాని కూలీలను పిలిపించి విచారించగా, వారు దొరికిన బంగారాన్ని చూపించారు. దీంతో యజమాని వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

ఈ నిధుల వెనుక పెద్ద చరిత్రే ఉంది!
ఈ ప్రాంతంలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవని, అందుకే ఇక్కడ గుప్తనిధులు ఉన్నాయనే నమ్మకం బలంగా ఉంది. గతంలో 1991లో అప్పటి భూ యజమానికి కూడా కొంత బంగారం లభించిందట. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే పొలంలో పనిచేసే ఒక జీతగాడికి కూడా పసిడి దొరికినట్లు గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు, గతంలో ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఈ చారిత్రక నేపథ్యం వల్లే ఈ భూమి చుట్టూ ఇప్పుడు ‘బంగారు’ అంచనాలు పెరిగిపోయాయి.

పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ.. రాత్రి వేళల్లో వేట!
బంగారం దొరికిందనే వార్త దావానలంలా వ్యాపించడంతో ఈ కథ సరికొత్త మలుపు తిరిగింది. దొరికిన బంగారాన్ని పంచుకున్న వారిపై చర్యలు తీసుకుని, ఆ నిధిని తమకు అప్పగించాలని.. ఆ భూమిని మొదట విక్రయించిన వ్యక్తి కుమారుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ పొలంలో కనకం దొరుకుతుందనే ఆశతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో ఆ భూమి పరిసరాల్లో రహస్యంగా సంచరిస్తున్నారు. ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా పండుతుందోనని జనం అక్కడ నిఘా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘బంగారు భూమి’ వ్యవహారం అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు పెద్ద సవాలుగా మారింది.

Advertisement

Also Read: వారెవ్వా పసిడి.. దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఖుషీ ఖుషీ!

Related News

ప్రాజెక్టు పూర్తిచేసే భాధ్యత నాదే.. హుస్నాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం భరోసా!

మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!

హైదరాబాద్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రాడ్.. రూ. 10 కోట్ల ఆస్తులు స్కామ్‌ చేసిన కేటుగాడు!

తండ్రి కర్మకాండల ఖర్చుల గొడవ.. అన్నను కత్తెరతో లేపేసిన తమ్ముడు!

తెలంగాణ పల్లె ప్రజలకు ఊహించని శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి భారీ గిప్ట్!

సాయం చేస్తానని వచ్చి.. రూ. 10 కోట్లు లేపేశాడు.. ఏకంగా 30 మందికి టోకరా!

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!

Big Stories

Advertisement
×