Big Stories

AP election Samantha’s entry: ఏపీ ఎలక్షన్‌లో గ్లామర్‌ డోస్‌, సమంత ఎంట్రీ

A dose of glamor in AP election, Samantha's entry

- Advertisement -

A dose of glamor in AP election, Samantha’s entry: ఏపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఏ క్షణమైన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. దీంతో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలన్ని ఎన్నికల కోసం సంసిద్ధం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు రాజకీయ వ్యూహాలను అవలంబిస్తోంది. ఇందుకు అనుగుణంగానే పార్టీలోకి వచ్చిన వారిని కలుపుకుపోతూ రాజకీయ పావులను కదుపుతోంది. ఈసారి ఎలాగైనా సరే వైసీపీ పార్టీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా జతకట్టాయి. ఇందులో భాగంగానే ఏపీ సీఎం జగన్‌ సైతం తగ్గేదెలే అంటున్నాడు.

- Advertisement -

తనదైన శైలీలో సైలెంట్‌గా తనపని చేసుకుంటూ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ టీడీపీ, జనసేన పార్టీలను ఎదుర్కునేందుకు తనదైన శైలీలో ముందుకు వెళ్తుంది వైసీపీ పార్టీ. ఇందుకోసం కొంచెం కాస్త గ్లామర్‌ డోస్‌ని పెంచనుంది. అందులో భాగంగానే హీరోయిన్ సమంతని రంగంలోకి దించనుంది. ఇందుకోసం వైసిపి పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతాను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే సమంతతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. దీనికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది.

Read More: వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత సవాల్.. అనపర్తిలో ఉద్రిక్తత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి సమంత 14 సంవత్సరాలు సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసుకుంది. గత 14 ఏళ్ల నుంచి ఇప్పటివరకు స్టార్ హీరోయిన్‌గా సమంత కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికి కూడా తన సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.

గతంలో ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ సమంత. మొదటి మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని మూవీని తన ఖాతాలో వేసుకుంది. మొదటి మూవీతోనే హీరో నాగచైతన్య, సమంత హిట్ కాంబో కావడంతో అక్కడే వారి ప్రేమకి పునాది పడినట్లు అయింది. ఆ తర్వాత వారి వివాహం, ఆ తరువాత హనీమూన్ ఆ తరువాత విడాకులు ఇలా చకచకా సంవత్సరకాలంలోనే జరిగిపోయాయి.

Read More: జగన్‌కు ఓటు వేయకండి.. వైఎస్ సునీత పిలుపు

సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు సమంత. భయంకరమైన వ్యాధి వచ్చినప్పటికి కూడా ఇటీవల విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాతో చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి తనకున్న వ్యాధితో బాధపడుతున్న సరే తనకొచ్చిన ఈ ఆఫర్‌ని మిస్ చేసుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు ఈ ముద్దుగుమ్మా. అంతేకాకుండా తన కెరీర్‌పై కూడా పుల్‌గా ఫోకస్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ. సమంత త్వరగా కోలుకోవాలని, తను మునుపటిలాగే తన నటనతో ఆడియెన్స్‌ని ఎప్పటిలాగే అలరించాలని కోరుకుందాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News