BigTV English

PF New Rule form 1st April 2024: పీఎఫ్ కొత్తరూల్.. ఎన్ని ఉద్యోగాలు మారినా పీఎఫ్ తో ప్రాబ్లమ్ ఉండదట..!

PF New Rule form 1st April 2024: పీఎఫ్ కొత్తరూల్.. ఎన్ని ఉద్యోగాలు మారినా పీఎఫ్ తో ప్రాబ్లమ్ ఉండదట..!

New Rule of Provident Fund


New Rule in PF Account from 1st April 2024: బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేయాలి. కుటుంబాలను పోషించుకోవాలి. పిల్లల్ని చదివించాలి. ఇంకా ఎన్నో బాధ్యతలు. అన్నీ సక్రమంగా నెరవేర్చాలంటే ఉద్యోగం చేయాల్సిందే. ఉద్యోగులు శాలరీ ఎక్కువ వస్తుందంటే.. ఉద్యోగం మారడం సహజం. అంతవరకూ ఓకే. కానీ.. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (PF Account)కు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కంపెనీ మారినపుడు పీఎఫ్ ఖాతాను ఎలా ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి ? ఖాతాలో ఉన్న పీఎఫ్ అమౌంట్ ను ఎలా విత్ డ్రా చేసుకోవాలి ? వడ్డీ ఎలా వస్తుందన్న విషయాలు తెలియక కంగారు పడుతుంటారు. అందుకే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈపీఎఫ్ఓ (Employees Provident Fund Organisation) కొత్తరూల్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. అదే ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్.

ఈ కొత్త రూల్ తో ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాతో కూడిన బెడద ఉండదు. ఉద్యోగం మారినపుడు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మునుపటి కంపెనీలో ఉన్న పీఎఫ్ అకౌంట్, అందులోని అమౌంట్ ఆటోమెటిక్ గా కొత్త కంపెనీ పీఎఫ్ అకౌంట్లోకి బదిలీ అవుతుంది. ఈ రూల్ అమల్లోకి వస్తే.. పీఎఫ్ ఖాతాదారుల ఇబ్బందులు తగ్గుతాయి.


Also Read: కొత్త ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఇన్ కం ట్యాక్స్ రూల్స్ ఇవే..

కొందరు ఉద్యోగులు.. ఉద్యోగం మారిన ప్రతీసారి కొత్త పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. పాత అకౌంట్ ను అందులో మెర్జ్ చేయరు. ఎలా చేయాలో తెలియక కొంతమంది, ఇబ్బందులు వస్తాయోమోనని ఇంకొంతమంది అకౌంట్ మెర్జ్ గురించి పట్టించుకోరు.

నేటి (ఏప్రిల్ 1) నుంచే ఈ రూల్ అమల్లోకి వస్తుందని ఈపీఎఫ్ఓ చెప్పినా.. ఇంతవరకూ మార్గదర్శకాలు జారీ కాలేదు. అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, అకౌంట్ మెర్జ్, వడ్డీ వంటి విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Related News

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Gold Rates Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే కానుకలపై టాక్స్ ఉంటుందా..ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి..

Big Stories

×