BigTV English

OnePlus Nord CE 4: ఈ రోజే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే..!

OnePlus Nord CE 4: ఈ రోజే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే..!
OnePlus Nord CE 4 launch
OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 Launch Today: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో వన్‌ప్లస్ 12 సిరీస్‌ను విజయవంతంగా ప్రారంభించింది. అయితే ఇప్పుడు మరొక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.


వన్‌ప్లస్ ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ సిఈ 4 5జీ(OnePlus Nord CE 4 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. సరికొత్త మిడ్-రేంజ్ ఫోన్‌ను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు.. వన్‌ప్లస్ కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.

నార్డ్ సిఈ 4 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 8GB LPDDR4X ర్యామ్ (8GB వర్చువల్ RAMకి మద్దతు), 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌ని కలిగి ఉంది. అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు ఎక్స్పండ్ స్టోరేజ్‌తో వస్తుంది.


అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్వా టచ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 100W సూపర్‌వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాగా ఇది నార్డ్ శ్రేణిలో మొదటిది అవుతుంది. ఈ ఫోన్‌ను కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం నుండి ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read: రెడ్‌మీ నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్

ఇది రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో ఒకటి డార్క్ క్రోమ్, మరొకటి సెలడాన్ మార్బుల్. దీని ధర విషయాల్ని మాత్రం కంపెనీ ఎక్కడా వెల్లడించలేదు. అయితే దీని అంచనా ధర ప్రకారం.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,999 ధర వద్ద ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అధిక స్టోరేజ్ కెపాసిటీని కోరుకునే వారికోసం.. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.26,999గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఈ రోజు వన్‌‌ప్లస్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో సాయంత్రం 6.30గంటలకు లైవ్ టెలీకాస్ట్ చేయబడుతుంది.

Tags

Related News

Instagram Friend Map: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నిపుణులు

Oppo K13 Turbo vs Redmi Note 13 Pro+ 5G: మిడ్ రేంజ్‌లో టఫ్ ఫైట్.. రెండు ఫోన్లలో ఏది బెస్ట్?

Control Z iphone Sale: రూ.9999 కే ఐఫోన్.. త్వరపడండి లిమిటెడ్ ఆఫర్

Keyboard Mouse AI: కీ బోర్డ్, మౌస్ లేకుండానే కంప్యూటర్లు.. అంతా ఏఐ మహిమ!

Flipkart Oppo: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లపై సూపర్ డీల్స్

Vivo V60 vs Oppo Reno 14: ₹40,000 బడ్జెట్ లో ఏది బెటర్?

Big Stories

×