Big Stories

New Tax Rules from April 1st: కొత్త ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఇన్ కం ట్యాక్స్ రూల్స్.. అవేంటంటే..?

new income tax rules from april 1st
new income tax rules from april 1st

New Income Tax Rules from April 1st 2024: 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసి.. ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ కొత్త ఫైనాన్షియల్ సంవత్సరం (2024-25 Financial Year)లో ఇన్ కం ట్యాక్స్ రూల్స్ మారుతున్నాయి. మారుబోతున్న రూల్స్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పారు. మరి ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మారుతున్న ఇన్ కం ట్యాక్స్ రూల్స్ ఏంటో చూద్దామా..

- Advertisement -

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఇకపై పన్ను దాఖలు విధానం మరింత సులభతరం అవుతుంది. పన్ను చెల్లింపు దారులు కొత్త పన్నువిధానం నచ్చకపోతే.. పాత పన్ను విధానాన్నే పాటించవచ్చు.

- Advertisement -
కొత్త పన్ను విధానంలో ఈ స్లాబ్ లు మారుతున్నాయ్..

మీ వార్షిక ఆదాయం 0-3 లక్షల రూపాయల వరకు ఉంటే పన్ను చెల్లించనక్కర్లేదు. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటే.. 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Investments : డబ్బులు సంపాదించుడు కాదు.. ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం బిగులు!

రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ ఆదాయం ఉంటే.. 10 శాతం పన్నును చెల్లించాల్సిందే.

వార్షిక ఆదాయం రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటే 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకూ ఉంటే.. 20 శాతం పన్ను చెల్లించాలి.

మీ వార్షిక ఆదాయం రూ.15 లక్షలకు మించి ఉంటే.. 30 శాతం ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ లో ఎలాంటి మార్పు చేయలేదు. పాత పన్నువిధానంలో ఉన్న రూ.50 వేలనే స్టాండర్డ్ డిడక్షన్ గా ఉంచారు. రూ.15.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న పింఛన్ దారులకు రూ.52,500 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది.

సర్ ఛార్జ్ రేటు తగ్గింపు

రూ. 5 కోట్లు.. అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వారికి గతంలో 37 శాతం సర్ ఛార్జ్ విధించారు. ఇప్పుడు దానిని 25 శాతానికి తగ్గించారు.

Also Read: State Bank of India: దేశవ్యాప్తంగా పనిచేయని స్టేట్ బ్యాంక్ అకౌంట్లు.. కారణం ఏంటంటే?

అలాగే కొత్త ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా ప్రీమియం ఆదాయం కూడా పన్ను పరిధిలోకి రానుంది. మీ జీవిత బీమా ప్రీమియం రూ.5 లక్షలు దాటితే అది కూడా పన్ను పరిధిలోకే వస్తుంది.

ఏప్రిల్ నుంచి ఆన్ లైన్ గేమ్స్ పై భారీగా పన్నుచెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి సంపాదిస్తే.. ఆ సంపాదనపై 115 BBJ ప్రకారం వచ్చిన ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తారు. దీనిని టీడీఎస్ గా తీసేస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News