BigTV English

Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రులు.. 30 ఏళ్ల తర్వాత అమృత సిద్ధి యోగం

Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రులు.. 30 ఏళ్ల తర్వాత అమృత సిద్ధి యోగం
Chaitra Navratri 2024
Chaitra Navratri 2024

Chaitra Navratri 2024: ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి ఏప్రిల్ 17న రామ నవమి రోజు ముగుస్తాయి. ఈ 9 రోజులు భగవతీ దేవి 9 రూపాలను పూజిస్తారు. నవరాత్రులు ఏడాదికి 4 సార్లు వస్తాయి. చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులు, రెండు గుప్త నవరాత్రులు. నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.


ఈ సమయంలో మాతృమూర్తి  వివిధ రూపాలను భక్తితో పూజించడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతారు. ఈ సంవత్సరం చైత్ర నవరాత్రుల్లో ఒక అద్భుతం జరగబోతోంది. 30 ఏళ్ల తర్వాత అమృత సిద్ధి యోగాతో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దీంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది.

అశ్వినీ నక్షత్రం నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. రాశులలో మొదటి రాశి అశ్వినీ నక్షత్రంగా పరిగణిస్తారు. మంగళవారం అమృతసిద్ధి యోగం కలుగుతుంది. ఇది ఏప్రిల్ 9న సూర్యోదయానికి 2 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ యోగంలో ఘటస్థాపన చేయడం వల్ల అదృష్టాన్ని పొందుతారు. అకాల మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చని అంటారు.


Also Read: ఆ రోజున తొలి సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త..! 

చైత్ర నవరాత్రి ఘటస్థాపన ముహూర్తం 2024
నవరాత్రుల మొదటి రోజు అంటే ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 6.25 నుంచి 10.27 వరకు ఘటస్థాపనకు ఉత్తమ సమయం. అంతే కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.48 గంటల వరకు ప్రారంభమయ్యే అభిజీత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపన చేయవచ్చు.

ప్రతి సంవత్సరం మాతా రాణి ఏదో వాహనంపై స్వర్గం నుంచి భూలోకానికి వస్తుంటారు. ఈ సంవత్సరం మాత రాణి అశ్వాన్ని ఎక్కి భూలోకానికి రానుంది. ఇది శుభం కాదు. మాత రాణి గుర్రంపై స్వారీ చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని అంటున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Gold ganesh idol: ఒకే అంగుళంలో అద్భుతం.. మెరిసే బంగారు వినాయకుడు.. మీరు చూశారా?

Hanuman darshan: భక్తుల మనసు దోచుకుంటున్న హనుమంతుడు.. లైఫ్ లో ఒక్కసారైనా చూసేయండి!

Ganesh Chaturthi Song: “వక్రతుండ మహాకాయా”.. ఏళ్లు గడిచినా దైవత్వాన్ని నింపుతూ!

Ganesh Chaturthi 2025: పండగ రోజు వినాయకుడిని ఈ సమయంలో పూజిస్తే.. అంతా శుభమే !

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ganesh Chaturthi 2025: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?

Big Stories

×