BigTV English

Mukesh Ambani: బాబోయ్.. ముఖేష్ అంబానీ ఇంట్లో పనివాళ్ల జీతం తెలిస్తే షాక్ తినాల్సిందే భయ్యా..

Mukesh Ambani: బాబోయ్.. ముఖేష్ అంబానీ ఇంట్లో పనివాళ్ల జీతం తెలిస్తే షాక్ తినాల్సిందే భయ్యా..

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఈ పేరు దేశంలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ముఖేష్ అంబానీ భారతదేశంలోని నంబర్ వన్ రిచెస్ట్ పర్సన్. ప్రపంచంలోని కుబేరుల టాప్-20 జాబితాల్లో ఇతను ఒకరు. ఆసియా ఖండమంతా ప్రసిద్ధి చెందిన ముఖేష్ అంబానీ.. లాస్ట్ ఇయర్ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని రూ.5000 కోట్ల వ్యయంతో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వివాహం చేసి ప్రపంచ దృష్టిని సైతం తన వైపు తిప్పుకున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. 2025 ఫిబ్రవరి 22 నాటికి 91.6 బిలియన్ డాలర్ల విలువతో ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 17 వ రిచెస్ట్ పర్సన్ గా కొనసాగుతున్నారు.


ALSO READ: RRB Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మరోసారి దరఖాస్తు గడువు పొడిగింపు..

దేశంలో అత్యంత రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేషన్ అంబానీ రూ.15,000 కోట్లతో ఇల్లును నిర్మించుకున్నారు. దీనికి ఈ భవంతిని యాంటిలియా అని పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒక్కటైన ఈ 27 అంతస్థుల భవంతిలో ముఖేష్ అంబానీ కుటుంబం నివసిస్తుంది. యాంటిలియా భవంతి ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇల్లు ప్రఖ్యాతి గాంచింది. అయితే ఇంత పెద్దదైన యాంటిలియా భవంతిలో పని వాళ్లను ఎలా నియమించుకుంటారు..? వారు శాలరీలు ఎలా ఇస్తారు అనేది ఈ స్టోరీలో సవివరంగా తెలుసుకుందాం..


ముఖేష్ అంబానీ ఇంట్లో పని చేసే వారికి జీతాలు భారీగా ఇస్తారట. పని చేసే వంటవాళ్లు, డ్రైవర్లు వంటి వారికి లక్షల్లో జీతాలు చెల్లిస్తారని టాక్. అంతే కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. యాంటిలియా భవంతిలో దాదాపు 600 నుంచి 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ముఖేష్ అంబానీ పర్సనల్ డ్రైవర్ జీతమే రూ.2లక్షలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. అంటే ఏడాదికి రూ.24లక్షల జీతం అన్నమాట.  ఈ జీతం దాదాపు పెద్ద పెద్ద కంపెనీలు సీఈవోలకు ఉంటుంది. ఈ భవంతిలో పని చేసే వ్యక్తులకు ఇతర లాభాలు కూడా ఉంటాయి.

ముఖేష్ అంబానీ  బాడీ గార్డులకు సైతం మంచి వేతనమే ఉంటుంది. వారికి నెలకు రూ.14,536 నుంచి రూ.55,869 వరకు శాలరీ ఉంటుంది. ఈ జీతం దేశంలో చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగుల జీతం కన్నా ఎక్కువగానే ఉంది. అయితే వీరిని ఉద్యోగంలో నియమించే విధానం గురించి  ఓసారి తెలుసుకుందాం. కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం వారి జీతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ALSO READ: DCIL Recruitment: డిగ్రీ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగం భయ్యా.. మిస్ అవ్వకండి.. రేపే లాస్ట్ డేట్

అంబానీ నివాసంలో ఉద్యోగం రావాలంటే ఎగ్జామ్, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈ రెండింట్లో కూడా పాస్ అవ్వాలి. అలాగే ఉద్యోగం పొందాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. సర్టిఫికెట్స్ కలిగి ఉండడం చాలాఅ ముఖ్యం. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే.. మీరు చెఫ్ కావాలంటే, మీకు కుకింగ్ లో సర్టిఫైడ్ అర్హత ఉండాలి. వంటపాత్రలు క్లీన్ చేయడానికి కూడా టెస్ట్ చేస్తారు. ఇంతకుముందు ఎక్కడ చేశారనేది పరిగణలోనికి తీసుకుంటారు.

ముఖేష్ అంబానీ ఇంట్లో ఉద్యోగులకు శాలరీ తో పాటు.. వారి కంపెనీ ఉద్యోగుల వలే ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. వైద్య బీమా, పలు ప్రోత్సాహాలతో ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉద్యోగుల శాలరీ, ఇతర బెనిఫిట్స్ అనేవి ఇంతకు ముందు ఉన్న ఎక్స్ పీరియన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. వర్కింగ్ స్కిల్, బాధ్యతగా తీసుకుంటే తగిన ప్రతిఫలం ఉంటుంది.

Related News

Trump: ట్రంప్ నిర్ణయాలు.. కంప్యూటర్ల ధరలకు రెక్కలు, వాటితోపాటు

EPFO New Rule: పీఎఫ్ డబ్బులతో ఇల్లు కట్టాలి అనుకుంటున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకే.. EPFO కొత్త మార్గదర్శకాలివే!

Jio Recharge Plans: మిస్ అయ్యానే.. జియోలో ఇన్ని ఆఫర్లు ఉన్నాయా!

iPhone 17 Air: వావ్ ఎంత స్మూత్‌గా ఉంది.. iPhone 17 Air సూపరబ్బా.

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Jio Mart vs D-Mart: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Big Stories

×