BigTV English

AFG vs ENG: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్‌ ఇంగ్లాండ్ డూర్‌ ఆర్‌ డై.. గెలిస్తేనే సెమీస్‌ !

AFG vs ENG: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్‌ ఇంగ్లాండ్ డూర్‌ ఆర్‌ డై.. గెలిస్తేనే సెమీస్‌ !

AFG vs ENG: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు మరికొద్ది గంటల్లో కీలక పోరు ప్రారంభం కాబోతోంది. నేడు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో గ్రూప్ – బి లోని ఇంగ్లాండ్ – ఆఫ్గనిస్తాన్ మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా దెబ్బతిన్న ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్ లో గెలుపొంది తమ ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే సెమిస్ రేసులో ఉంటుంది. ఇక ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే.


 

సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే ఒక్కో విజయం సాధించి రెండేసి పాయింట్లుతో ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో నేడు ఇంగ్లాండ్ – అఫ్గనిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడ్డ ఇంగ్లాండ్ జట్టు 350 పైచిలుకు స్కోర్ చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో జట్టులోని లోపాలను సవరించుకొని నేడు ఆఫ్ఘనిస్తాన్ తో సమరానికి సిద్ధమైంది.


ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరం కాగా.. అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ని జట్టులోకి తీసుకున్నారు. ఇక బెన్ డకెట్, జో రూట్ మంచి ఫామ్ లో ఉండగా.. ఫిల్ సాల్ట్, జోష్ బట్లర్, హ్యారీ బ్రూక్ కూడా రాణించాలని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యం ఆ జట్టును కలవరపెడుతోంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై 352 పరుగులు చేసినప్పటికీ.. బౌలింగ్ వైఫల్యంతో కాపాడుకోలేకపోయింది.

ఈ మ్యాచ్ లో ఆ జట్టు పేస్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ రాణిస్తే జట్టు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక ఆఫ్గనిస్తాన్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయలేం. ఆ జట్టు ఒకప్పటిలా లేదు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ నబీ లతో కూడిన స్పిన్ త్రయం ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఆఫ్ఘనిస్తాన్ తన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై ఘోరంగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా 300 పైచిలుకు పరుగులు చేస్తే.. ఆఫ్ఘనిస్తాన్ కనీస 50 ఓవర్లు కూడా ఆడలేక 208 పరుగులకే కుప్పకూలింది.

ఈ నేపథ్యంలో నేడు జరిగే కీలక పోరులో జట్టంతా కలిసి సమిష్టిగా సర్వశక్తులు వడ్డీ తేనే ఇంగ్లాండ్ జట్టుని ఎదుర్కోవచ్చు. లేదంటే ఇంటి దారి పట్టాల్సిందే. నేడు జరగబోయే ఇంగ్లాండ్ – ఆఫ్గనిస్తాన్ మధ్య ఆసక్తికర పోరు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వీక్షించవచ్చు.

 

ఇక నేడు జరిగే కీలక మ్యాచ్ లో తుది జట్ల అంచనా విషయానికి వస్తే.. ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్. ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(wk), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్-ఉర్-రహమాన్/నూర్ అహ్మద్, ఫూజుల్హక్మద్.

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×