Indian Railways: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లు త్వరలోనే పరుగులు పెట్టనున్నాయి. భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రోటోటైప్‌ను బెంగళూరులోని బీఈఎంఎల్ ఫెసిలిటీలో ఆవిష్కరించారు. ఈ కోచ్ పది రోజుల కఠినమైన ట్రయల్ టెస్టులు పూర్తి చేసుకుని ట్రాక్స్ ఎక్కనుంది. ‘వందే భారత్ చైర్ కార్స్ తర్వాత మేం వందే భారత్ స్లీపర్ కార్స్ పై పని చేశాం. దీని నిర్మాణం పూర్తయింది. ఈ ప్రోటోటైప్ ట్రైన్ ట్రయల్, టెస్టుల తర్వాత ప్రజలకు అందుబాటులోకి రానుంది.
కేంద్ర మంత్రి వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న స్లీపర్ క్లాస్‌కు దీనికి ఉన్న తేడాలు ఏమిటీ? వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో అందుబాటులోకి తెస్తున్న అధునాతన సదుపాయాలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు.
ఇది వరకు అందుబాటులో ఉన్న స్లీపర్ ట్రైన్‌లకు, వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లకు మధ్య ప్రధానంగా ట్రైన్ స్పీడ్, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలుగా చెప్పుకోవచ్చని అధికారులు వివరించారు. ఈ కొత్త స్లీపర్ ట్రైన్‌లో ఫైర్ సేఫ్టీలో హై స్టాండర్డ్ మెయింటెయిన్ చేశారు. ట్రైన్‌లోపల క్రాష్ వర్తీ ఎలిమెంట్స్ అంటే.. క్రాష్ బఫర్స్, కపులర్స్ వంటివి.. ప్రమాదం జరిగినా ప్రయాణికులపై దాని ప్రభావం తక్కువ చేస్తుంది. అలాగే.. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలను అందిస్తుంది. ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్టు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్, డిస్‌ప్లే ప్యానెల్స్, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు కూడా అందుబాటులో ఉంటాయి. వికలాంగుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, ప్రత్యేక టాయిలెట్లు ఉంటాయి. ఫస్ట ఏసీ కార్‌లో స్నానానికి వేడి నీళ్లు కూడా అందిస్తారు. ఇది ప్రయాణికుల ప్రయాణ అలసటను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ ఎక్స్‌టీరియర్ ప్యాసింజర్ డర్లు ఉంటాయి. సెన్సార్ ఆధారిత కమ్యూనికేషన్ డోర్స్ ఉంటాయి. టాయిలెట్‌లో సువాసన వచ్చేలా డిజైన్ చేశారు. డ్రైవింగ్ సిబ్బందికి టాయిలెట్ ఉంటుంది. విశాలమైన లగేజ్ రూమ్ ఉంటుంది.
Hon’ble MR Shri @AshwiniVaishnaw and Hon’ble MoSR Shri @VSomanna_bjp, inspected the production of Vande Bharat Sleeper Version train set at BEML Bengaluru.#VandeBharatSleeper pic.twitter.com/4qPYy7leAN
— Ministry of Railways (@RailMinIndia) September 1, 2024
Also Read: Miniter Ponguleti: మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి కన్నీరుమున్నీరు
మొత్తం 16 బోగీలతో ఈ స్లీపర్ ట్రైన్ ఉంటుంది. ఇందులో 11 ఏసీ థర్డ్ టయర్, నాలుగు సెకండ్ టయర్ ఏసీ కోచ్‌లు, ఒకటి ఫస్ట్ ఏసీ ఉంటుంది. థర్డ్ టయర్611 బెర్త్‌లు, సెకండ్ టయర్‌లో 188 బెర్త్‌లు, ఫస్ట్ ఏసీ క్లాస్ కోచ్‌లో 24 బెర్త్‌లు ఉంటాయి.
First visual of the #VandeBharatSleeper is here!
Union Minister @AshwiniVaishnaw unveiled the prototype version of #VandeBharat sleeper coach today.#VandeBharatTrain
Credit: @DDNewslive@RailMinIndia @Murugan_MoS @PIB_India pic.twitter.com/TbTew5TJLN
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 1, 2024
మన దేశ చరిత్రలో భారత రైల్వేది సుదీర్ఘ అధ్యాయం. భారత రైల్వే 1853లో తొలి ట్రైన్‌ను నడిపింది. ప్రపంచ దేశాల్లోనే నాలుగో అతిపెద్ద నెట్‌వర్క్ మన రైల్వే సొంతం. అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న ప్రభుత్వ సంస్థ ఇదే. ప్రతి రోజు మన దేశంలో భారత రైల్వే ద్వారా సుమారు రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన భారత రైల్వేకు వందే భారత్ ట్రైన్‌ల రాక కొత్త మలుపు తెచ్చింది. ఇప్పటికే వందే భారత్ ట్రైన్‌లు మన రైల్వే నెట్‌వర్క్‌లో పరుగులు పెడుతున్నాయి. ఈ ట్రైన్‌లు సక్సెస్ అయ్యాక ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లను కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది.