EPAPER

Nani: ఎన్టీఆర్ ఒప్పుకోలేనిది.. నాని ఒప్పుకున్నాడా..?

Nani: ఎన్టీఆర్ ఒప్పుకోలేనిది.. నాని ఒప్పుకున్నాడా..?

Nani: సాధారణంగా మల్టీస్టారర్ సినిమాల్లో ఒక హీరో గొప్ప.. ఒక హీరో తక్కువ అని ఏం ఉండదు. ఇద్దరు సమానంగా చేస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అది పాత్ర బరువును బట్టి ఉండే కానీ, ఆ పాత్రలో ఎవరు నటించారు.. అనేది పెద్దగా పట్టించుకోరు. కానీ, కొన్నిసార్లు హీరో ఫ్యాన్స్ మాత్రం దాన్ని పట్టించుకుంటారు. అది ఎంతలా అంటే.. మా హీరో కనిపించిన సీన్స్ ఇన్ని.. ? ఇంత టైం అని లెక్కలు కూడా వేసుకుంటారు.


ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ టైమ్ లో ఇలానే జరిగింది. ఈ విషయం అందరికి తెలుసు. సినిమా మొత్తంలో తారక్ కన్నా రామ్ చరణ్ ఎక్కువగా కనిపించాడని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అది పెద్ద రచ్చగా కూడా మారింది. చివరికి రాజమౌళి సైతం దీనికి సమాధానం చెప్పలేకపోయాడు. తాను ఇద్దరినీ సమానంగానే చూపించినట్లు తెలిపాడు. ఇక ఈ విషయమై ఎన్టీఆర్ కు చరణ్ కు మధ్య విభేదాలు కూడా తలెత్తాయని టాక్.

సీన్స్ ఎక్కువ ఉన్నా.. పాత్ర బలంగా ఉన్నా. తనకంటే ఎక్కువ పేరు చరణ్ కు వచ్చినా.. ఎన్టీఆర్ దాన్ని అంగీకరించడానికి ఒప్పుకోలేదని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదే పరిస్థితి న్యాచురల్ స్టార్ నానికి వచ్చింది. అయితే ఎన్టీఆర్ లా నాని చేయలేదు. నిర్మొహమాటంగా మీడియా ముందే తనకంటే ఎస్ జె సూర్యకే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏంటంటే.. నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ జె సూర్య విలన్ గా కనిపించాడు.


ఆగస్టు 29 న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో సూర్యగా నాని, ఎస్ ఐ దయానంద్ గా ఎస్ జె సూర్య నటించాడు. ఇక ఇందులో సూర్య కన్నా దయాకే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చాడు వివేక్. నిజం చెప్పాలంటే ఇందులో హీరో దయా అనే చెప్పొచ్చు. ఆ విషయాన్నీ సక్సెస్ మీట్ లో జర్నలిస్టులు సూటిగా నానిన్ ప్రశ్నించారు.

ఇక దానికి నాని మాట్లాడుతూ .. ” సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే..  నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు. నాకంటే సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. ఇది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇది నేను ఇంటికి తీసుకెళ్తాను. నాకు ఇది స్పెషల్ మూమెంట్. నాకు సక్సెస్ లు కొత్త కాదు.. కానీ, ఇది నేను నమ్మింది. నేను కథ విన్నప్పుడే నాకన్నాన సూర్యగారికే ఎక్కువన పేరు వస్తుంది అని నమ్మాను. నిజం చెప్పాలంటే ఇది సూర్య సినిమా కాదు దయ సినిమా. వివేక్.. దయ పాత్ర రాయడం.. అందులో సూర్య గారు నటించడం.. అది అన్ బీట్ బుల్” అని చెప్పుకొచ్చాడు.

ఇలా ఒక హీరో.. మరో నటుడును పొగడడం కానీ, తనకన్నా ఎక్కువ పేరు వచ్చిందని సంతోషపడడం కానీ చేయడం చాలా అరుదు. అది నాని చేసి చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఎన్టీఆర్ ఒప్పుకొలేనిది.. నాని ఒప్పుకున్నాడు.. శభాష్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Big Stories

×