BigTV English

Paytm Payments Bank: మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో డబ్బును తీయొచ్చా..?

Paytm Payments Bank: మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో డబ్బును తీయొచ్చా..?


RBI Deadline for Paytm Payments Bank: పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. మార్చి 15వ తేదీ నుంచి పీపీబీఎల్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం విధించిన ఆంక్షల ప్రకారం చెల్లింపు బ్యాంకులో డిపాజిట్, క్రెడిట్ లావాదేవీల సేవలు మార్చి 15 నుండి నిలిపివేయబడతాయి.

ఈ నేపథ్యంలో.. ఆర్‌బిఐ తరచుగా అడిగే ప్రశ్నల జాబితాను సిద్ధం చేయడమే కాకుండా.. ఇతర బ్యాంకింగ్ ఎంపికల వైపు మొగ్గు చూపాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


మాతృ సంస్థ Paytm దాని కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేలా.. పేటీఎం యాప్ వాడటాన్ని కొనసాగించేందుకు విలుగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్సును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి మీరు ఇంకా పేటీఎం పేమెంట్ బ్యాంకింగ్ చేస్తుంటే మాత్రం.. ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.

Also Read: RBI Actions on Paytm: పేటీఎంపై మరిన్ని చర్యలు తీసుకున్న ఆర్బీఐ..!

మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంకుల్లో పనిచేయనివి ఇవే..

పేటీఎం పేమెంట్ బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ బ్యాంక్ ఖాతాలోకి డబ్బును బదిలీ చేయడానికి లేదా డిపాజిట్ చేయడానికి, వడ్డీ మినహా కస్టమర్ ఖాతాలో క్రెడిట్ లేదా డిపాజిట్ చేయడం సాధ్యం కాదు. అయితే భాగస్వామి బ్యాంక్ నుండి క్యాష్‌బ్యాక్, స్వీప్-ఇన్ లేదా రీఫండ్ అనుమతించబడుతుంది.

కస్టమర్లు తమ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో జీతం క్రెడిట్, డైరెక్ట బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ లేదా సబ్సిడీ వంటి క్రెడిట్‌ను పొందలేరు.

మార్చి 15 తర్వాత.. కస్టమర్‌లు తమ వాలెట్‌కి టాప్-అప్ చేయలేరు. అలాగే డబ్బును బదిలీ చేయలేరు.

ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్: మార్చి 15 తర్వాత.. కస్టమర్‌లు పేటీఎం పేమెంట్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేయలేరు. అయితే.. వారు తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మేరకు తమ టోల్‌ను చెల్లించుకోవచ్చు. ఇతర బ్యాంకులు జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్ సేవలను వినియోగించుకోవాలని ఆర్‌బీఐ ఖాతాదారులకు సూచించింది.

NCMC రీఛార్జ్: పేటీఎం పేమెంట్ బ్యాంక్ జారీ చేసిన NCMC కార్డ్‌ను కస్టమర్‌లు రీఛార్జ్ చేయలేరు.

Also Read: Online UPI Payments : టెక్నాలజీని తెగ వాడేస్తున్నారుగా… ఆన్ లైన్ పేమెంట్స్ విలువ రూ.12.11 లక్షల కోట్లు…

నిర్ణీత గడువు ముగిసిన తర్వాత.. UPI లేదా IMPS ద్వారా కూడా పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో డబ్బు బదిలీ చేసేందుకు అందుబాటులో ఉండదు.

మార్చి 15 తర్వాత పేటీఎంలో ఏవేం మారవు..?

పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుండి నిధుల ఉపసంహరణ : Paytm పేమెంట్ బ్యాంక్‌లో అందుబాటులో ఉన్న నిధుల మొత్తం ప్రకారం కస్టమర్లు తమ నిధులను ఉపసంహరించుకోవచ్చు లేదా బదిలీ చేయవచ్చు.

రీఫండ్, క్యాష్‌బ్యాక్, స్వీప్-ఇన్ సేవలు మార్చి 15 తర్వాత కూడా భాగస్వామి బ్యాంకుల నుండి అందుబాటులో ఉంటాయి.

మీ Paytm పేమెంట్ బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉన్నంత వరకూ మీరు విద్యుత్ బిల్లు, OTT సబ్‌స్క్రిప్షన్, లోన్ EMI చెల్లించగలరు. అయితే భవిష్యత్తులో పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేయబడదు.

Also Read: Paytm-RBI: పేటీఎంకు రిలీఫ్.. మార్చి 15వరకు లావాదేవీలకు ఒకే చెప్పిన ఆర్బీఐ..

Paytm పేమెంట్ బ్యాంక్ వాలెట్‌లో అందుబాటులో ఉన్న డబ్బును అందుబాటులో ఉన్న మేరకు కస్టమర్‌లు ఉపయోగించుకోగలరు. దీనిని విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చు.

UPI, IMPS ఉపయోగించి పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం మార్చి 15 తర్వాత మొత్తం విత్‌డ్రా అయ్యే వరకు అందుబాటులో ఉంటుంది.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×