BigTV English

RBI Fine oN SBI, Canara Bank : ఎస్‌బీఐపై రూ.2 కోట్లు, కెనరా బ్యాంక్‌పై రూ.32 లక్షలు జరిమానా.. ఆర్‌బీఐ చర్యలు..

RBI Fine oN SBI, Canara Bank : ఎస్‌బీఐపై రూ.2 కోట్లు, కెనరా బ్యాంక్‌పై రూ.32 లక్షలు జరిమానా..  ఆర్‌బీఐ చర్యలు..

SBI


RBI Imposes Fine On SBI, Canara Bank: కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడంపై ఎస్బీఐ, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ , ఓషన్ క్యాపిటల్ మార్కెట్‌పై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.2 కోట్లు, కెనారా బ్యాంకుకు రూ. 32 లక్షలు జరిమానా విధించబడింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 (బీఆర్ చట్టం) సెక్షన్ 19లోని సబ్-సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్బీఐకు ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. బీఆర్ చట్టంలోని సెక్షన్ 26ఏ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్ 2014 కింద చర్యలు తీసుకుంది.కెనరా బ్యాంకుకు రూ. 32 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది.


ఎస్బీఐ 2022 మార్చి 31 నాటికి దాని ఆర్థిక స్థితిపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించామని RBI తెలిపింది. ఈ తనిఖీ సమయంలో ఎస్బీఐ కొన్ని కంపెనీల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో ముప్పై శాతం కంటే ఎక్కువ మొత్తంలో వాటాలను తాకట్టు పెట్టినట్లు గుర్తించామని పేర్కొంది. అది నిర్దేశించిన వ్యవధిలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ , అవేర్‌నెస్ ఫండ్‌కు అర్హత గల మొత్తాన్ని క్రెడిట్ చేయడంలో విఫలమైందని వెల్లడించింది.

Read More: ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై 9శాతం వరకు వడ్డీ.. పూర్తి వివరాలు ఇవే!

బీఆర్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్బీఐపై ఎందుకు జరిమానా విధించకూడదనే దానిపై కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేశామని ఆర్బీఐ ప్రకటించింది.  నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పణలు, అదనపు సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బీఆర్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించిందని రుజువైందని ఆర్బీఐ తెలిపింది. అందుకే జరిమానా విధించామని స్పష్టం చేసింది.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×