BigTV English

Loan Foreclosure Charges RBI : రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్.. ముందస్తు చెల్లింపుల ఛార్జీలకు నో చెప్పిన ఆర్బిఐ

Loan Foreclosure Charges RBI : రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్.. ముందస్తు చెల్లింపుల ఛార్జీలకు నో చెప్పిన ఆర్బిఐ

Loan Foreclosure Charges RBI | బ్యాంకు లేదా ఏదైనా ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు రుణగ్రహీత అనుకున్న సమయం కన్నా ముందస్తుగా రుణం పూర్తి చెల్లిస్తే.. బ్యాంకు అలా చేసినందుకు చార్జీలు వసూలు చేస్తాయి. అలా చేయడం సరికాదని ఆర్బిఐ భావిస్తోంది. రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి బ్యాంకులు ప్రీ పేమెంట్ పెనాల్టీ/ ఫోర్క్లోజర్ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్బీఐ (RBI) ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. సాధారణ రుణగ్రహీతలు, ఎంఎస్ఈలు (చిన్న మధ్య తరగతి పరిశ్రమలు) తీసుకునే అన్ని ఫ్లోటింగ్ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీసుకునే రుణాలపైనా ముందస్తు చెల్లింపుల ఛార్జీలు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.


‘టైర్ 1, టైర్ 2 ప్రాథమిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, బేస్ లేయర్ ఎన్‌బిఎఫ్‌సీలు మినహా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీలు (ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల బ్యాంకులు, ఇతర ఎన్‌బిఎఫ్‌సీలు) ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందుగా తీర్చివేస్తే ఎలాంటి ఛార్జీలు/పెనాల్టీలు విధించరాదు’ అని ఆర్బీఐ ముసాయిదా సర్క్యులర్ పేర్కొంది. ఎంఎస్ఈ రుణగ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ లేకుండా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాపై మార్చి 21 వరకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గినా మీ లోన్ వడ్డీ రేటు తగ్గలేదా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటు రెపోను 6.50 శాతం నుండి 6.25 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్లు (ఆర్ఎల్ఎల్ఆర్)ను తగ్గించేందుకు ఇప్పటికే పలు బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వడ్డీ రేటు పావు శాతం తగ్గి, చాలామంది గృహరుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది.. చాలామంది అనుకున్నట్లు గృహరుణంపై వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకులు వెంటనే నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) తగ్గించవు. ఇక్కడ తగ్గేది వ్యవధి మాత్రమే. అయితే వడ్డీ రేటు ఇప్పటికీ తగ్గలేదంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.


Also Read:  గూగుల్ పే ఇక ఫ్రీ కాదు.. ఆ పేమెంట్స్ పై ఫీజు వసూలు!

ఫిక్స్‌డ్ వడ్డీ రేటు రుణాలు
మీరు తీసుకున్న గృహరుణానికి చలన వడ్డీ (ఫ్లోటింగ్) లేదా స్థిర వడ్డీ (ఫిక్స్‌డ్)లో ఏది వర్తిస్తుందో ముందుగా తెలుసుకోండి. ఒకవేళ స్థిర వడ్డీ వర్తిస్తే మీ రుణాలపై వడ్డీ రేటు తగ్గదు. సాధారణంగా బ్యాంకుల్లో మూడేళ్ల పాటు స్థిర వడ్డీ రేటు ఆ తర్వాత చలన వడ్డీ రేటు వర్తించేలా రుణ ఒప్పందం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రుణ వ్యవధి మొత్తం స్థిర వడ్డీనే ఉండొచ్చు. కాబట్టి, ముందుగా బ్యాంకును సంప్రదించి, మీ రుణానికి ఏ వడ్డీ వర్తిస్తోందో తెలుసుకోండి. ఒకవేళ స్థిర వడ్డీతో ఉంటే.. ఆ రుణాన్ని చలన వడ్డీకి మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇందుకోసం బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తాయి.

చలన వడ్డీ రేటు (ఫ్లోటింగ్)
కొన్నిసార్లు చలన వడ్డీ రేటు విధానంలో ఉన్నా.. ఈ తగ్గింపును బ్యాంకులు వర్తింపచేయవు. ఇందుకూ ఒక కారణం ఉంది. చలన వడ్డీ రేటు విధానంలో నిధుల ఆధారిత రుణ వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మీ రుణం ఉందనుకోండి.. అప్పుడూ వడ్డీ తగ్గకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ బ్యాంకును సంప్రదించాలి. రెపో ఆధారిత రుణ వడ్డీ రేటుకు మారేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తుంటాయి. ఈ రుసుము రుణ మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ బ్యాంకు శాఖను సంప్రదించి లేదా ఆన్లైన్ బ్యాంకింగ్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రెపో రేటు ఆధారిత వడ్డీ రేటుకు మారడమే మంచిది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకే ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి వస్తుంది. గృహరుణ సంస్థల నుంచి రుణం తీసుకున్నప్పుడు.. ఆయా సంస్థలు వడ్డీ రేటును సవరించినప్పుడే, మీ రుణంపై వడ్డీ తగ్గుతుంది. ఈ తగ్గింపును పొందేందుకు కొంత రుసుము చెల్లించక తప్పదు.

రిస్క్ ఇన్వెస్టింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి
అన్సెక్యూర్డ్ రుణాలు, వేలం వెర్రిగా డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరిగిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఎం. రాజేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల్లో ఉండే ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అనాలోచితమైన విధంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే (ఆర్థికీకరణ) రిస్కులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు.

 

ఈ నేపథ్యంలో ప్రజల్లో అన్సెక్యూర్డ్ రుణాలు, స్పెక్యులేటివ్ ఇన్వెస్టింగ్ వల్ల తలెత్తే రిస్కుల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఆర్థిక రంగానికి చెందిన ఇతర నియంత్రణ సంస్థలతో కూడా ఆర్బీఐ కలిసి పని చేస్తోందని రావు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే అమాయకులు మోసగాళ్ల బారిన పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వ్యవస్థే పూనుకోవాలని సూచించారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో నియంత్రణనేది చాలా సున్నితమైన అంశంగా మారిందని రావు చెప్పారు. నియంత్రణను మరీ తగ్గిస్తే వ్యవస్థాగతంగా రిస్కులు పెరుగుతాయని, అలాగని మరీ ఎక్కువగా నియంత్రిస్తే కొత్త ఆవిష్కరణలకు, రుణ లభ్యతకు అవరోధాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.

 

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×