Layout Regularization Scheme: లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS- Layout Regularization Scheme)లో భాగంగా రేవంత్ సర్కార్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లలో పెండింగ్ లో ఉన్న ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ALSO READ: Jobs in Indian Railways: శుభవార్త.. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నేరుగా రెగ్యులరైజేషన్ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే మార్చి 31 లోగా ఈ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ లోగా దరఖాస్తు చేసుకున్నవారికి ఫీజులో కొంత రాయితీ వర్తించునంది. 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా పక్కా ప్లాన్ ను ప్రభుత్వం రెడీ చేసింది. ఈ క్రమంలోనే గవర్నమెంట్ ల్యాండ్, జల వనరులకు సంబంధించిన సర్వే నంబర్లకు అప్లికేషన్ లను మినహాయించి.. రిమైనింగ్ అన్ని దరఖాస్తుకు అటోమెటిక్ గా ఫీజు జనరేట్ చేసే సిస్టమ్ ను తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మరో రెండు రోజుల్లో ప్రత్యే క సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
అయితే, తెలంగాణ సర్కార్ దీని విషయం మరింత పకడ్బందీగా.. స్పష్టతతో కూడిన మార్గ దర్శకాలను రూపొందించనుంది. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో ఇప్పటికీ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించిన విషయం తెలిసిందే. ఇవాళ అటోమేటిక్ ఫీజు జనరేట్, ఇతర ఏమైనా సమస్యలు ఉంటే సులభతరం చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనుంది. అలాగే దరఖాస్తుకు సంబంధించిన రుసుము సమాచారాన్ని వివరించనున్నారు. ఇక ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కు 200 మీటర్ల దూరంలో ఫ్లాట్ల విషయంలో ఇతర అధికారుల విచారణకు ప్రమేయం లేకుండా, గవర్నమెంట్ ల్యాండ్ కు పక్కనే ఆనుకుని లేని సర్వే నంబర్లలో వేసి లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు పెట్టిన దరఖాస్తుల విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.