RBI: ప్లాస్టిన్ కరెన్సీ నోట్లను ప్రవేశ పెట్టే విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఆర్బీఐ సూచనలతో ఇప్పటికే పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారు. తాజాగా ఇప్పుడు ఆర్బీఐ వంతైంది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి వాటిని ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు.
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తున్నాయంటే బెంబేలెత్తుతున్నారు సగటు సామాన్యులు. ఎందుకంటే.. నోట్ల రద్దు విషయంలో జరిగిన పరిణామాలను గమనించారు. అందుకే కరెన్సీ నోట్లు అనగానే మళ్లీ ఎప్పుడు నోట్లు చేస్తారేమోనని భయం వారికి వెంటాడుతోంది. అందుకే మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చేశారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం లో రూ.10, రూ.20 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా ఆ రెండు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించాలా? వద్దా ? అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ నోట్లను పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీతో భర్తీ చేసే ప్రతిపాదనేమీ లేదన్నారు. కాగితం నోట్లతో పాటు ప్లాస్టిక్ నోట్లు చెల్లుబాటవుతాయన్నది ఆర్బీఐ మాట.
ఒక్కో డినామినేషన్‌లో 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్లు ముద్రించనున్నట్లు చెప్పారు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి అనుమతిచ్చిందన్నారు. కరెన్సీ నోట్లు అధికంగా చేతులు మారడంతో వాటి జీవిత కాలం చాలా తక్కువ. పలు దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు 30 ఏళ్లకు పైగా చలామణిలో ఉన్నాయి. వాటి జీవిత కాలం చాలా ఎక్కువ. పేపర్ నోట్లతో పోలిస్తే నాలుగు రెట్ల కాలం మన్నుతాయని అన్నారు.
గడిచిన దశాబ్దంలో దాదాపు రూ.50 లక్షల కోట్ల విలువైన చిరిగిన, పాడైన కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రపంచంలోని 60కి దేశాలకు పైగానే పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకువచ్చాయి. అందులో ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్ వంటి దేశాలు ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో అధిక విలువ గల నోట్లను రద్దు చేయడం లేదా నిలిపివేయడం 3 సార్లు జరిగింది. జనవరి 1946 లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రూ. 500, రూ.1,000 మరియు రూ. 10 వేలు విలువ గల నోట్లను రద్దు చేసింది.
ALSO READ: జూలై 31 గడువు మిస్ అయినా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం ఉందా?
1954లో భారత ప్రభుత్వం రూ.1,000, రూ.5,000, రూ. 10 వేల నోట్లను తిరిగి ప్రవేశపెట్టింది. 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రూ1,000, రూ.5,000, రూ. 10 వేల నోట్లను రద్దు చేసింది. మూడోసారి మోదీ పాలనతో 2016లో రాత్రికి రాత్రికి నోట్లను రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకొచ్చిన విషయం తెల్సిందే.