Gold Price Today: అంతర్జాతీయ వరుస పరిణామాలు ప్రభావంతో బంగారం ధర రోజు రోజుకూ దిగి వస్తోంది. దీంతో మహిళల్లో ఒక్కటే ఆనందం. అంతర్జాతీయ మార్కెట్లోతోపాటు దేశీయ మార్కెట్లో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బంగారం దారిలో వెండి కూడా నడుస్తోంది. దీంతో గురువారం దేశీయ మార్కెట్లో ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
పెరుగుతున్న ఇంధన ధరలు, ఊహించిన దానికంటే మెరుగైన అమెరికా డేటా, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మదుపరులు బంగారం మార్కెట్లో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ధరలు దిగి వస్తున్నాయి. దాని ప్రభావం దేశీయ మార్కెట్ పై పడడంతో బంగారం, వెండి ధరలు గడిచిన మూడు రోజులుగా పరిశీలిస్తే.. రూ. 500 నుంచి వెయ్యి మధ్యలో తగ్గుతూ వచ్చింది.. ఇంకా కంటిన్యూ అవుతోంది.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం-వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 42 డాలర్ల మేరా పడింది. ప్రస్తుతం ఔన్స్ రేటు 4297 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.64 శాతం తగ్గి, ధర 64.26 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సింగపూర్ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.08 గంటలకు స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్సుకు 4,290 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. గత సెషన్‌లో 4 శాతం పడిపోయిన వెండి ధర, ప్రస్తుతం 0.2 శాతం తగ్గి ఔన్సుకు 64.31 డాలర్ల వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ర్యాలీ, రూపాయి విలువ క్షీణించడం, ఏప్రిల్‌లో దిగుమతి సుంకం 6 నుంచి 15 శాతానికి పెరగడం వంటి కారణాలతో దేశీయ బంగారం ధరలపై పడింది. ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 60 శాతం పెరిగాయి. 10 గ్రాములకు సుమారు రూ. 98,000 నుంచి రూ. 1.57 లక్షలకు చేరుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బులియన్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,090 కాగా, కిలో వెండి ధర రూ. 2,36,080గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24K 10 గ్రాములకు రూ. 1,52,050 వద్ద ఉంది. 22K బంగారం ధర రూ. 1,39,416గా కొనసాగుతోంది. వెండి ధర క్రమంగా దిగి వస్తోంది. ప్రస్తుతం కిలో రేటు రూ. 2,36,080 వద్ద అమ్ముడవుతోంది.
ALSO READ: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో నెలకు రూ.4000 పెట్టుబడితో 5 ఏళ్లకు ఎంత వస్తుంది?
గురువారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 24K బంగారం ధర రూ. 1,51,550గా ఉంది. 22K బంగారం ధర రూ. 1,38,921గా ఉంది. ముంబై, బెంగుళూరు, కోల్ కత్తా వంటి నగరాల్లో దాదాపు ఇదే స్థాయిలో అటు ఇటుగా ధరలు ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాములకు గోల్డ్ ధర రూ. 1,52,250 ఉండగా, 22K ధర రూ. 1,39,563గా ఉంది. వెండి ధర మాత్రం కిలోకు రూ. 2,36,080గా ఉంది. నెల రోజుల్లో వెండి ధర సుమారు 3.6 శాతం తగ్గగా, గత సంవత్సర కాలంలో ఇది 76.2 శాతం పైగా పెరిగింది.