E-Paper
Advertisement

యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపులు మునుపటిలాగే ఫ్రీ.. NPCI కీలక ప్రకటన!

యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపులు మునుపటిలాగే ఫ్రీ.. NPCI కీలక ప్రకటన!
Advertisement

UPI MDR Charges: యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధింపునకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టత ఇచ్చింది. ఎంపిక చేసిన కొన్ని యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించినప్పటికీ.. దాదాపు 96 శాతం కంటే ఎక్కువ లావాదేవీలపై ఎలాంటి జీఎస్టీ భారమూ ఉండదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా కల్పించింది.

అసలేంటీ ఎండీఆర్ మార్గదర్శకాలు?

ఇన్నాళ్లు ఉచితంగా జరిగిన యూపీఐ లావాదేవీలపై నూతన మార్గదర్శకాల ప్రకారం కొత్తగా ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ‘పర్సన్ టు మర్చంట్’ (P2M) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఫీజు వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఇది గరిష్టంగా ఒక లావాదేవీకి రూ. 300 వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. అది కూడా వ్యాపారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని.. వినియోగదారులకు దీంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

NPCI ఇచ్చిన స్పష్టత ఏంటి?

Advertisement

అయితే ఎండీఆర్ విధింపు వల్ల వ్యాపారులపై 18 శాతం జీఎస్టీ భారం అదనంగా పడుతుందనే వార్తలపై ఎన్‌పీసీఐ తాజాగా స్పందించింది. ప్రస్తుతం దేశంలో జరిగే మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీల్లో 96 శాతానికి పైగా లావాదేవీల విలువ రూ. 2,000 కంటే తక్కువే ఉందని ప్రభుత్వ డేటా ఆధారంగా స్పష్టం చేసింది. రూ. 2,000 లోపు లావాదేవీలపై ఎండీఆర్ సున్నా కాబట్టి వాటిపై ఎలాంటి జీఎస్టీ వర్తించదని తెలియజేసింది. అంతేకాకుండా వ్యాపారులు చెల్లించే జీఎస్టీపై ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్’ పొందే వెసులుబాటు ఉంటుందని వివరణ ఇచ్చింది.

చిన్న వ్యాపారులకు భారీ ఉపశమనం

మరోవైపు చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎన్‌పీసీఐ ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. క్యూఆర్‌ కోడ్ ద్వారా నెలలో రూ.1 లక్ష వరకు వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు ఈ ఎండీఆర్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. అటు పెట్రోల్ బంకులు, ఇన్సూరెన్స్, టెలికాం, రైల్వే వంటి విభాగాలకు సగటు 0.4 శాతం రేటు కాకుండా వేరే రకమైన స్థిరమైన ఫ్లాట్ ఎండీఆర్ రేట్లను నిర్ణయించారు.

Advertisement

Also Read: హోటల్ గదిలో రహస్య కెమెరాలు.. కచ్చితంగా చెక్ చేయాల్సిన 10 సీక్రెట్ ప్రదేశాలు!

కొత్తగా ఎండీఆర్ ఛార్జీ ఎందుకంటే?

యూపీఐ వ్యవస్థను మరింత సమర్థవంతంగా విస్తరించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీసీఐ తాజా గణాంకాల ప్రకారం ఒక్క ఆగస్టులోనే యూపీఐ ద్వారా దాదాపు రూ. 29.82 లక్షల కోట్ల విలువైన 24.51 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. దీన్ని బట్టి నెట్‌వర్క్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా రోజువారీ చిన్న చిన్న చెల్లింపులు చేసే సామాన్యులకు, చిన్న వ్యాపారులకు ఈ నూతన విధానం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎన్ పీసీఐ మరోమారు క్లారిటీ ఇవ్వడం గమనార్హం.

Also Read: రూ.4,000 పెట్టుబడితో రూ.2.85 లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో మైండ్ బ్లోయింగ్ స్కీమ్!

Tags

Related News

రూ.4,000 పెట్టుబడితో రూ.2.85 లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో మైండ్ బ్లోయింగ్ స్కీమ్!

యుపిఐ ఎండిఆర్ తప్పుడు నిర్ణయం, మళ్లీ క్యాష్ వైపు దేశం.. మాజీ నీతి ఆయోగ్ చీఫ్ వార్నింగ్

మీ ముఖాన్ని అద్దెకు ఇస్తారా? కొత్త పార్ట్ టైమ్ బిజినెస్ గురూ

అక్టోబర్ ఒకటి నుండి FDలపై కొత్త రూల్స్.. ఎక్కడైనా ఒకటే వడ్డీ, బల్స్ అయితే ఆ రూటే వేరు

40 ఏళ్ల వయసులో రూ.80 లక్షలు సేవింగ్స్.. రూ.1 లక్ష నెలజీతంతో ఇలా సాధ్యం

మహిళలకు తీపికబురు.. దిగొస్తున్న బంగారం ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయి?

IIM MBA విద్యార్థి దుస్థితి.. 250పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు

Big Stories

Advertisement
×