Gold Price Today: పుత్తడి ప్రియులు ఆనందాల్లో మునిగి తేలుతున్నారు. బంగారం- వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. తగ్గినట్లే తగ్గి కాస్త మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పసిడి ప్రియులకు శుభవార్త. మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వెండి విషయంలో రూ.5 వేలు దిగిరావడంతో వినియోగదారులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు.. బులియన్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఫెడ్ వడ్డీలపై ప్రకటనలతో డాలర్ బలపడింది. దీనికితోడు అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో గోల్డ్ రేట్లపై ప్రభావం చూపినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముడి చమురు ధరలు దిగివచ్చినప్పటికీ దాని ప్రభావం బంగారంపై కనిపించలేదు. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 108 డాలర్ల నుండి 98 డాలర్లు దిగజారింది. ముడి చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు తగ్గాయి.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడ మొదలైంది. బుధవారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 6 డాలర్లకు పైగా పెరిగి ఔన్స్ బంగారం ధర 4352 డాలర్లు చేరింది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.76 శాతం మేర పెరిగి 67.06 డాలర్ల వద్దకు కొనసాగుతోంది. కిలో వెండి రేటు రూ.5 వేల మేరా పడిపోయింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ధరలు మళ్లీ పెరగడం వచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో వివిధ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రెండో రోజు కాస్త తగ్గుముఖం పట్టింది. తులం బంగారం రేటు రూ.2400 వరకు తగ్గింది. బుధవారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములు రూ.1250 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.1,53,330 వద్దకు కొనసాగుతోంది. 22 బంగారం రేటు తులానికి రూ.1150 కిందకు దిగొచ్చింది. 10 గ్రాములు రూ.1,40,550 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. కిలో వెండి రేటు రూ.5000 మేరా దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,55,000 మార్క్ వద్ద కొనసాగుతోంది.
ALSO READ: ఈఎంఐ తక్కువే అని లోన్ తీసుకుంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉందా?
ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,53,320 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.1,40,540 వద్ద కంటిన్యూ అవుతోంది. దీంతోపాటు ముంబై, బెంగుళూరు, కోల్‌కతా సిటీల్లో కాస్త తక్కువగా ఉంది. వెండి ధర భాగానే దిగొచ్చింది. ఢిల్లీలో కిలో రూ.2,49,900 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి. ముంబై, బెంగుళూరు, కోల్ కతా నగరాల్లో కాసింత తక్కువగా ఉంది. చెన్నైలో మాత్రం వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.