Vivo S2: దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో తమ S సిరీస్‌ను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కొత్తగా Vivo S2 స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ Vivo S2 రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా.. 8GB RAM, 256GB వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. సఫైర్ బ్లూ, రీగల్ బ్రాంజ్, సిల్క్ వైట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ హ్యాండ్ సెట్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఛార్జింగ్ కేబుల్స్ మురికిగా మారాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
కొనుగోలుదారుల కోసం కంపెనీ మంచి ఆఫర్లను ప్రకటిస్తోంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 15 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తాయి. వీటితో పాటు ఉచితంగా ఒక సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ, 18 నెలల పాటు 5,000GB జియో క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రో యాక్సెస్ పొందవచ్చు.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6తో పనిచేసే Vivo S2లో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫోన్ వేగంగా పనిచేసేందుకు ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ఉపయోగించారు.
Vivo S2 ప్రధాన ఆకర్షణ దీని 7,050mAh భారీ బ్యాటరీ. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. రెండింటిలోనూ 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్‌లతో ఈ ఫోన్ వస్తుంది.
Also Read: క్వాలిటీకే కట్టుబడిన యాపిల్.. భారత్‌లో రూ.83,000 కోట్ల చారిత్రాత్మక మైలురాయి!