Best vacuum cleaners for home: ఎంత సర్దినా ఇల్లు మళ్లీ దుమ్ముగా మారిపోతోందా? రోజూ చీపురు పట్టి ఒళ్లు నొప్పులు తెచ్చుకోవడం చిరాగ్గా అనిపిస్తోందా? అయితే.. మీ డీప్-క్లీనింగ్ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టే.. సమయం వచ్చేసింది! మారుతున్న టెక్నాలజీకి తగినట్లుగా మార్కెట్‌ను షేక్ చేస్తున్న అల్ట్రా-మోడ్రన్ వాక్యూమ్ క్లీనర్స్ మార్కెట్ లో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సోఫా మూలల్లో ఉన్న దుమ్ము నుంచి కార్పెట్లపై పడిన మొండి మరకల వరకు అన్నింటినీ సెకన్లలో మాయం చేయొచ్చు. ఎలాంటి శ్రమ లేకుండా మీ ఇంటిని రాయల్ లుక్‌లో మెరిపించే ..ఆ టాప్-5 ట్రెండీ వాక్యూమ్ క్లీనర్స్ ఏంటో, వాటి ఫీచర్స్ , ధరల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. AGARO Regal Handheld Vacuum Cleaner: మీరు చిన్న ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారా? అయితే.. ఈ హ్యాండ్‌హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ మీకు పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఇది చాలా తేలికగా ఉంటుంది. సోఫాలు, కర్టెన్లు, మూలల్లో ఉన్న దుమ్మును ఇది క్షణాల్లో పీల్చేస్తుంది.
ధర: రూ. 1,898
ఇండియన్ బ్రాండ్లలో అత్యంత ఆదరణ పొందిన యూరికా ఫోర్బ్స్ కంపెనీకి చెందిన ఈ మోడల్ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇది బలమైన సక్షన్ పవర్‌తో పని చేస్తుంది. చిన్న ఇళ్లకు ఇది చాలా బాగుంటుంది. అంతే కాకుండా దీని తేలికైన డిజైన్ ఉండటం వల్ల ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
ధర: రూ. 2,999
ఇది కేవలం దుమ్మును మాత్రమే కాకుండా.. నేల మీద పడిన నీటిని లేదా తడి మరకలను.. కూడా శుభ్రం చేస్తుంది. 1600 వాట్స్ పవర్ కలిగిన మోటార్ ..దీని సొంతం. అంతే కాకుండా.. పెద్ద ఇళ్లు, బాల్కనీలు , గ్యారేజ్ శుభ్రం చేయడానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో బ్లోవర్ ఫంక్షన్.. కూడా ఉంది.
ధర: రూ.6,970
ఫిలిప్స్ బ్రాండ్ అనగానే ..క్వాలిటీ మారుపేరు. ఈ బ్యాగ్ లెస్ వాక్యూమ్ క్లీనర్ పవర్‌సైక్లోన్ 5 టెక్నాలజీతో వస్తుంది. ఇది గాలిలోని సూక్ష్మమైన దుమ్ము కణాలను కూడా సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తుంది. పెద్ద కార్పెట్లు ఉన్న ఇళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.
ధర: రూ.9,398
Also Read: పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!
మీరు ఏ మాత్రం శ్రమ పడకుండా.. ఇల్లు క్లీన్ కావాలనుకుంటే.. ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ బెస్ట్ ఛాయిస్. ఇది మీ ఇల్లంతా ఆటో మేటిక్‌గా.. మ్యాప్ చేసుకుని, తానే స్వయంగా నేలను ఊడ్చి, తుడి చేస్తుంది. స్మార్ట్ యాప్ సపోర్ట్ కూడా దీనికి ఉంది.
ధర: సుమారు రూ.20,499 నుంచి ప్రారంభం
మరి ఇంకెందుకు ఆలస్యం? మీ బడ్జెట్, అవసరాలకు సరిపోయే వాక్యూమ్ క్లీనర్‌ను ఇప్పుడే ఎంచుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి