E-Paper
Advertisement

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే
Advertisement

Radhika Apte:చిత్ర పరిశ్రమలో బోల్డ్ గా నటించడమే కాదు అంతే బోల్డ్ గా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే అతి కొద్ది మంది సెలబ్రిటీస్ లో రాధిక ఆప్టే కూడా ఒకరు. అందం, అభినయంతో ఆకట్టుకోవడమే కాకుండా మనసులో ఏది ఉన్నా సరే నిర్మొహమాటంగా బయటకు చెప్పే ఈమె ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. గతంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితులు , క్యాస్టింగ్ కౌచ్ పై ఈమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇకపోతే రీసెంట్గా ఈమె నటించిన లస్ట్ స్టోరీస్ 3 ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాలను పంచుకుంది.

ఇంటిమేట్ సీన్ల వల్ల నరకం..

ముఖ్యంగా ఇంటిమేట్ సీన్ల కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు.. అలాగే ఈ ఇంటిమేట్ సీన్ల వీడియోలు.. తన ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో కనిపించడం, ఇరుగు పొరుగువారు ఆ వీడియోలు చూస్తున్నారు అని తెలిసిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది? ఇలా పలు విషయాలపై ఆమె స్పందించింది.

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్..

Advertisement

” ఒకసారి నేను నటించిన ఇంటిమేట్ సీన్ లీక్ అవ్వడంతో నాలుగు రోజులపాటు నేను ఇంటి గుమ్మం కూడా దాటలేకపోయాను. ఇరుగు పొరుగు వారు నా వీడియోని చూస్తున్నారని తెలిసినప్పుడు నరకం అనుభవించాను. ముఖ్యంగా నా కారు డ్రైవర్ , ఇంటి వాచ్‌మెన్ పదేపదే ఆ వీడియోలు చూస్తున్నప్పుడు.. ఇకపై అతడు ఇంటికి వస్తాడా అని నా స్టైలిస్ట్ నన్ను ప్రశ్నించారు. నేను చేసిన సీన్ ను చూసిన అపరిచితుడు కూడా ఎక్కడ నా ఇంటికి వస్తారో అని భయపడ్డాను.

ALSO READ:బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

ఆ అనుభవం నా భద్రతా విషయంలో భయపెట్టింది..

Advertisement

అయితే ఆ నరకం, ఆ అనుభవం రెండూ నన్ను భద్రత విషయంలో కూడా భయపెట్టాయి. ఈ వీడియో చేసిన సమయంలో ఒంటరిగా నివసిస్తుండడంతో నా డ్రైవర్, నా వ్యక్తిగత సిబ్బందితో నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇక ఈ వీడియో లీకైన తర్వాత వెంటనే డ్రైవర్ , స్పాట్ బాయిలకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాను. మీరు ఆ క్లిప్ ను చూశారా ? ఒకవేళ చూసినా.. మీరు నాతో కలిసి పని చేయడానికి , నన్ను రక్షించడానికి మీరు సిద్ధంగా ఉంటేనే నాతో పని చేయండి అని చెప్పాను. అయితే నా పరిస్థితి అర్థం చేసుకున్న వారు నాకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

భయపడి అలాంటి పాత్రలు చేయలేదు..

ఒక పాత్రను ఒప్పుకోవడానికి.. ఇలాంటి కారణాలకు భయపడి నేను వదులుకున్నాను. ఒకవేళ దానిని అంగీకరించి ఉంటే , నా కుటుంబానికి మరింత ముప్పు వాటిల్లేదనే భయం వేసింది. ఇలాంటి ఘటనలు ఎంతోమంది ఇండస్ట్రీ మహిళలు ఎదుర్కొంటున్నారు.. దయచేసి సినీ రంగంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి అంటూ రాధిక చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సినిమా హిట్ కోసం మహిళలు ఇబ్బందులు పడాల్సిందేనా..

ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒక యాక్షన్ సీన్ చేసేటప్పుడు షర్టు గుండీలు తీసి నటిస్తారా? అని నన్ను అడిగారు . యాక్షన్ సీక్రెన్సులో శరీరాన్ని వేగంగా కదిలిస్తాం కాబట్టి కుదరదు అని చెప్పాను. అయినా సరే ఆ వ్యక్తి నన్ను వినిపించుకోకుండా కనీసం లో దుస్తులైన ధరించి ఆ సీన్ చేయమని ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను ఒప్పుకోలేదు. సినిమాను హిట్ చేయడం కోసం మహిళలను వారి పరిధిలో దాటేలా ఒత్తిడి చేయడం కరెక్టా అంటూ తనదైన శైలిలో ప్రశ్నించింది . మొత్తానికైతే సినిమా హిట్టు కోసం మహిళలను ఇండస్ట్రీలో ఇబ్బంది పెడుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నాయి.

Related News

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

Big Stories

Advertisement
×