Garden Plants For Pest Control: ఇంటిచుట్టూ మొక్కలు పెంచుకోవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా కొన్ని మొక్కలు కీటకాలను కొంతవరకు దూరంగా ఉంచడంలో కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దోమలు, ఈగలు, కొన్ని రకాల కీటకాల బెడద ఎక్కువగా ఉండే ఇళ్లలో సహజమైన మార్గాలను అనుసరించేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో రెండు ముఖ్యమైన మొక్కలు నల్లీశ్వరి, మింట్ తులసి. ఈ మొక్కలు పెరట్లో ఉంటే, పాములు, దోమలు దరిచేరవు.
నల్లీశ్వరిని కొన్ని ప్రాంతాల్లో నాగధూళి, సర్పాక్షి లాంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ మొక్కకు సంబంధించిన సంప్రదాయ నమ్మకాలలో పాములను దూరంగా ఉంచుతుందనే ప్రచారం ఉంది. ముఖ్యంగా మొక్క నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన పాములకు నచ్చదని చాలాకాలంగా చెబుతుంటారు. ఇంటి చుట్టూ ఈ మొక్కను పెంచడం వల్ల పాములు రావట.
మింట్ తులసి కూడా దోమలు రావడనే ప్రచారం ఉంది. పుదీనా వాసన కలిగిన ఈ తులసి కారణంగా దోమలు దగ్గరకు రావు. తులసి, పుదీనా లాంటి సుగంధ మొక్కల్లో ఉండే వాసనలను కొన్ని కీటకాలు ఇష్టపడకపోవచ్చు. అయితే, కేవలం ఒకటి రెండు మొక్కలను ఇంటి దగ్గర పెట్టుకోవడం వల్ల దోమలు పూర్తిగా మాయమవుతాయని చెప్పలేం. దోమలను కంట్రోల్ చేయాలంటే, ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకోవడం మంచిది.
ఈ రకమైన సుగంధ మొక్కలను ఇంటి కిటికీల దగ్గర, మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర, గార్డెన్ బోర్డర్ లో పెంచుకోవచ్చు. అయితే మొక్కకు సరైన సూర్యరశ్మి, నేలలో తగిన తేమ అందేలా చూడాలి. మొక్కల పెరుగుదల కోసం ఎక్కువ నీరు పోయడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా దోమల సమస్య ఉన్న ఇళ్లలో మొక్కలకు నీరు పోసిన తర్వాత కుండీలు, ట్రేలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే మొక్కల పేరుతోనే దోమలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇంటిచుట్టూ పొదలు, చెత్త, రాళ్ల కుప్పలు, కట్టెలు ఎక్కువగా ఉంటే పాములకు దాక్కునే ప్రదేశాలు లభిస్తాయి. అందువల్ల పరిసరాలను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. తలుపులు, కిటికీల కింద ఖాళీలు ఉంటే వాటిని మూసివేయడం కూడా ఉపయోగపడుతుంది.
ఇంటి పెరట్లో నల్లీశ్వరి, మింట్ తులసి వంటి సుగంధ మొక్కలను పెంచుకోవడం వల్ల పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటంతో పాటు కొన్ని కీటకాలను కొంతవరకు నిరోధించే అవకాశం ఉంటుంది. కానీ, ఇవి పాములు, దోమలకు పూర్తి రక్షణ కవచంలా పనిచేస్తాయని భావించకూడదు.
Read Also: హైదరాబాద్‌లోనే జపాన్ ఫీలింగ్, మచ్చా తాగుతూ.. అనిమే చూస్తూ.. ఎంజాయ్ చేసేయండి!