E-Paper
Advertisement

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం

ఆర్బీఐ కీలక నిర్ణయం.. మూడేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై ఆర్థిక భారం
Advertisement

RBI Decision: గడిచిన మూడురోజులుగా మార్కెట్లో అనుకున్నట్లే జరిగింది. సామాన్యులు ఊహించినట్టుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను సవరించింది. రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీరేట్లను ఆర్‌బీఐ పెంచడం ఇదే తొలిసారి.

అందరూ ఊహించినట్టుగా.. ఆర్బీఐ కీలక నిర్ణయం

అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. సోమవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచినట్టు వెల్లడించారు. దీంతో 5.25 శాతం నుంచి 5.50 చేరింది.

నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెంపు, ఈఎంఐలపై భారం

Advertisement

దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ఇదే. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో దానికి సంబంధించి లింకైన లోన్ వడ్డీ రేట్లను పెరగనున్నాయి. ముఖ్యంగా హౌసింగ్, వాహనాలు, పర్సనల్ లోన్లపై అదనపు భారం పడనుంది. ఫలితంగా వాటి తాలుకా ఈఎంఐలు పెరగనున్నాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈ విషయంలో డిపాజిట్లు చేసేవారికి కాస్త శుభవార్త అని చెప్పాలి.

2023 ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచింది. ఆనాడు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. అక్కడి నుంచి రెండేళ్లు ద్రవ్యోల్బణం పెరగక పోవడంతో కంటిన్యూ చేసింది. గతేడాది నుంచి క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌, డిసెంబరులో 25 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి్స్తూ వచ్చింది. కేవలం 10 నెలల వ్యవధిలో 125 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6.50 శాతం నుంచి 5.25 శాతానికి చేరింది.

రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచడం, లేకుంటే యథాతథం-ఆర్బీఐ

Advertisement

ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ.. ప్రపంచ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం వాణిజ్య అనిశ్చితి, ఇరాన్ యుద్ధ ప్రభావం వాణిజ్యం, సరఫరా గొలుసు సమస్యల కారణంగా దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలపై కొంత ప్రతికూల ప్రభావం కలిగించవచ్చని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, దాని స్థితి స్థాపకతను కంటిన్యూ చేస్తోందన్నారు. అదే సమయంలో మరొక కీలక పాయింట్ చెప్పారు. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గించే అవకాశం లేదని తేల్చేశారు. ఆ లెక్కన రెపో రేటు పెంచడం, లేకుంటే యథాతధంగా ఉంచడం జరుగుతుందని వెల్లడించారు.

ALSO READ: EPFతో పాటు NPS కూడా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత డబుల్ బెనిఫిట్.. ఏం చేయాలంటే?

ఆర్‌బిఐ ఈ ఏడాదికి జిడిపి వృద్ధి అంచనాను గతంలో 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచింది. రెండవ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. వ్యయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తయారీ రంగ కార్యకలాపాలు నిలకడగా ఉన్నాయని, సేవల రంగం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. స్థిర పెట్టుబడులు బలంగా కొనసాగుతున్నాయని తెలియజేసింది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. దీనివల్ల నిత్యావసర వస్తువులపై ధరల ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఫారిన్‌ ఎక్స్ఛేంజీ నిల్వలు బాగానే ఉన్నాయని చెబుతూ, 11 నెలల వరకు దిగుమతులకు ఢోకా లేదని ప్రస్తావించింది.

Related News

EPFతో పాటు NPS కూడా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత డబుల్ బెనిఫిట్.. ఏం చేయాలంటే?

టెలికాం రంగంలో సంచలనం.. 126 కోట్లకు చేరిన మొబైల్ యూజర్లు.. ట్రాయ్ రిపోర్టులో షాకింగ్ లెక్కలు!

పుట్టుకతో ఎడమ చేయిలేదు.. పట్టుదలతో చదివి రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగం

దసరాకు జియో ఐపీఓ.. ఒక్కో షేరు ధర ఎంత ఉండొచ్చు, మరి జీఎంపీ మాటేంటి?

ఆధార్‌ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే

మళ్లీ దిగుతున్న గోల్డ్-వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ధరల మాటేంటి?

20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి

Big Stories

Advertisement
×