E-Paper
Advertisement

పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధం.. కొత్త పార్టీ పేరేంటో తెలుసా?

పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధం.. కొత్త పార్టీ పేరేంటో తెలుసా?
Advertisement

Dhanush:  ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ధనుష్ (Dhanush) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనలోని ప్రతిభ చాటుతూ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. మరొకవైపు రాజకీయరంగ ప్రవేశం కూడా చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ధనుష్ ఆ వార్తలను నిజం చేయడమే కాకుండా తన కొత్త పార్టీని స్థాపించి, ఆ పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించినట్లు తమిళనాడు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ధనుష్ పెట్టబోతున్న ఆ కొత్త పార్టీ ఏంటి? దాని పేరేమిటి ?ఆ కొత్త పార్టీ థీమ్ ఏంటి ?ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. కొత్త పార్టీ పేరుకి రిజిస్టర్..

తాజాగా తమిళ సినీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిన అంశం ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళ కథానాయకుడిగా ధనుష్ రాజకీయ అరంగేట్రానికి వేగంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న ధనుష్.. ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ధనుష్ తన రాజకీయ పార్టీ కోసం ‘తమిళగ ఎళుచ్చి కళగం’  అనే పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ పేరుతో పార్టీని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించినట్లు తమిళ్ రాజకీయ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ధనుష్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త్వరలోనే రాజకీయ లక్ష్యాలపై ధనుష్ అధికారిక ప్రకటన..

Advertisement

ఇకపోతే గత కొంతకాలంగా ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఇప్పుడు ఈ కొత్త పార్టీ పేరు సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది. కానీ ధనుష్ తన రాజకీయ ప్రస్తానానికి సంబంధించిన విషయాలను స్వయంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇదిలా ఉండగా మరొకవైపు త్వరలోనే పార్టీ పేరు, విధివిధానాలు , జెండా, రాజకీయ లక్ష్యాలపై ధనుష్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. విజయ్ లాగే ధనుష్ కూడా సినిమా జీవితాన్ని పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ రంగంలోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ: వెంటిలేటర్ పై జబర్దస్త్ కమెడియన్.. వైద్యులు ఏమన్నారంటే?

అభిమాన సంఘాల ద్వారా పొలిటికల్ ఎంట్రీ..

నిజానికి తమిళనాడులో సినీ హీరోలు రాజకీయాల్లోకి వచ్చే ముందు అభిమాన సంఘాలను ఒక బలమైన వ్యవస్థగా మార్చుకుంటారు అనే కామెంట్లు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమలహాసన్, విజయ్ వంటి సినీ ప్రముఖులు కూడా రాజకీయాలతో ముడిపడే ముందు ఇలా అభిమాన సంఘాలను బలమైన వ్యవస్థగా మార్చుకున్నారు. అందుకే ధనుష్ కూడా తన అభిమానులను రాజకీయంగా సహకరించేలా ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ మొదలయ్యింది. మరి చూద్దాం ఈ వార్తలన్నింటికీ ధనుష్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో.

Related News

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

మళ్లీ తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×