Heavy rains: గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లితోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరపి లేకుండా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా రహదారులున్నీ జలమయం అయ్యాయి. అక్కడ రోడ్లు అన్నీ వాగులు, వంకలను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సవాయి మాధోపూర్ లో సుర్వాల్ డ్యామ్ ఓవర్ ఫ్లో కారణంగా భారీ గుంత ఏర్పడింది. ఈ గుంతలో ఓ భారీ చెట్టను వేళ్లతో సహా పెకలించి నీటిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
#WATCH | Rajasthan: A big portion of land caves in due to heavy rainfall in Sawai Madhopur. pic.twitter.com/fUzz8GTdht
— ANI (@ANI) August 24, 2025
భారీ వర్షానికి ఏర్పడిన గుంత..
రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల ధాటికి రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వరద ప్రవాహ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సుర్వాల్ డ్యామ్ ఓవర్ ఫ్లో కారణంగా భారీ స్థాయిలో గుంత ఏర్పడింది. వర్షానికి డ్యాం నుంచి భారీ వరద నీరు రావడంతో 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతుతో.. దాదాపు 2 కిలోమీటర్ల మేర గుంత ఏర్పడింది. భారీ గుంత చూడడానికి వాటర్ ఫాల్ ను తలపిస్తోంది. అయితే వరద ప్రవాహం పెరగడంతో ఓ భారీ చెట్టు వేర్లతో సహా పెకిలించి భారీ గుంతలో పడిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
వాటర్ ఫాల్‌ను స్పష్టించిన భారీ వర్షం..
ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ప్రకృతి చాలా అద్భుతమైనది.. భారీ వర్షంతో ఓ వాటర్ ఫాల్‌నే సృష్టించింది’ అని కామెంట్ చేయగా.. మరొకరు భారీ వర్షాలకు చెట్లు కూడా వరదల్లో కొట్టుకుపోతున్నాయి.. అంటే ఏ రేంజ్ లో వర్షాలు పడుతున్నాయో చూడండి’ అని రాసుకొచ్చాడు. మొత్తానికి ఈ వీడియో చూడడానికి బాగున్నా.. అక్కడ స్థానికులకు మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
ఇది రాష్ట్రంలో పరిస్థితి..
రాష్ట్రంలోని భారీ వర్షాలకు జైపూర్ రోడ్డు సర్వీస్ లేన్ పూర్తిగా నీట మునిగింది. అనేక రహదారుల్లో రెండు అడుగుల వరకు నీరు చేరింది. దీని వల్ల అరడజనుకు పైగా రెసిడెన్షియల్ కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు రోజు ప్రయాణించే రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.