Big Stories

Rekha Buys A Building For Rs 118 Crore: సముద్రం వ్యూ కోసం.. ఏకంగా తొమ్మిది ఫ్లాట్స్

- Advertisement -

Rekha Buys A Building For Rs 118 Crore: స్టాక్‌మార్కెట్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. ఆయన్ని ఇన్వెస్టర్ మాంత్రికుడిగా చెబుతారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు విషయానికొస్తే.. చాలా మంది సముద్రానికి దగ్గరగా ఇళ్లు ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తారు.

- Advertisement -

బాలీవుడ్, హాలీవుడ్ హీరోలైతే అస్సలు వెనక్కి తగ్గరు. అమెరికాలో హాలీవుడ్ స్టార్స్ సముద్రానికి సమీపంలోని ఇళ్లను కొనుగోలు చేయడం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అలాంటి కోవలోకి చెందినవారే దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వైఫ్ రేఖా. తన ఇంటి నుంచి సముద్రం చూసే అనుభూతి దూరం అవుతుందని భావించారు. అందుకు అడ్డుగా ఉన్న ఓ భవనంలోని కొన్ని ఫ్లాట్స్‌ను కొనేశారు. వాటి విలువ అక్షరాలా 118 కోట్ల రూపాయలు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. ఈ విషయాన్ని ఓ ఇంగ్లీస్ వెబ్‌సైట్ తన కథనంలో వెల్లడించింది.

ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా? సౌత్ ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతం. ఆ భవనంలో 24 ఫ్లాట్స్ ఉండగా, అందులోని 19 వరకు రేఖా ఫ్యామిలీల చేతిలో ఉన్నట్లు చెబుతున్నారు. రేఖాకు చెందిన రేర్ విల్లా రెసిడెన్స్ సముద్రానికి అభిముఖంగా ఉన్న రాక్‌‌‌‌‌‌‌సైడ్ అపార్ట్‌మెంట్స్‌కు వెనకాల ఉంటుంది. 50 ఏళ్ల పైబడిన రాక్ సైడ్ అపార్ట్‌మెంట్స్ సహా మరికొన్ని భవనాలను పునర్ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఈ పునర్ నిర్మాణం జరిగితే రేర్ విల్లా నుంచి అరేబియా సీ వ్యూ దూరం అవుతుందని భావించిన ఆమె కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.

గతేడాది నుంచి వివిధ సంస్థల ద్వారా తొమ్మిది ఫ్లాట్లను 118 కోట్లకు కొనుగోలు చేసినట్టు రాసుకొచ్చింది. దీంతో పునర్ నిర్మించాలంటే అధిక ఫ్లాంట్లు ఉన్న ఓనర్ నుంచి క్లీన్ చిట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రక్రియను షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News