E-Paper
Advertisement

AAFA: తెలంగాణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోరు.. అసలు తగ్గేదే లే..!

AAFA: తెలంగాణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోరు.. అసలు తగ్గేదే లే..!
Advertisement

AAFA: టాలీవుడ్ సెన్సేషన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అంటే కేవలం వెండితెరపై డ్యాన్సులు, డైలాగులు మాత్రమే కాదు.. అదొక ఎమోషన్‌గా అందరికీ ఎక్కేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు ఆయన అభిమానులు. తాజాగా కరీంనగర్ వేదికగా జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (Allu Arjun Fans Association) రాష్ట్ర స్థాయి సమావేశం అత్యంత వైభవంగా, భారీ ఎత్తున విజయవంతమైందని వారు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బన్నీ ఆర్మీని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఈ మీటింగ్ ఒక బలమైన పునాదిగా నిలిచిందట. ఇటీవల అల్లు అర్జున్.. ‘ఏడాదికి ఒక మంచి పని’ అనే కాన్సెప్ట్‌తో అభిమానులను దగ్గరకు తీస్తున్న విషయం తెలిసిందే. దీనికై అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun Fans) అసోసియేషన్ ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదు జిల్లాలకు చెందిన నూతన కమిటీలను ప్రకటించారు.

Also Read- Alekhya Tarakaratna: తారకరత్న మరణం.. ఇంటికి పిలిచి మరి అవమానించారు.. అలేఖ్య ఎమోషనల్!

బలోపేతం దిశగా అడుగులు

Advertisement

ఈ సమావేశానికి AAFA తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ నేతృత్వం వహించారు. కేవలం సినిమా రిలీజ్ రోజున హడావుడి చేయడమే కాకుండా, క్రమశిక్షణతో కూడిన ఒక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కీలకమైన ఐదు జిల్లాలకు నూతన జిల్లా కమిటీలను ప్రకటించారు. ఆ జిల్లాలు ఏవంటే.. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్. ఈ కమిటీల ద్వారా క్షేత్రస్థాయిలో అభిమానుల మధ్య సమన్వయాన్ని పెంచడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా AAFA నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనున్నారు. ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు అల్లు అర్జున్ నామస్మరణ మారుమోగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read- South Cinema: థియేటర్లలో సినిమా మనుగడ కోసం ఫిల్మ్ ఛాంబర్స్ కీలక నిర్ణయం! ఏంటంటే?

స్టార్‌డమ్ నుంచి సామాజిక బాధ్యత వరకు

Advertisement

అల్లు అర్జున్ ఇచ్చిన ‘One Good Deed Every Year’ పిలుపు మేరకు.. అభిమానులందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తున్నారు. ప్రతి అభిమాని ఏడాదికి కనీసం ఒక మంచి పని చేసి సమాజానికి అండగా నిలవాలనే సంకల్పంతో అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ సమావేశంలో అంజి యాదవ్ ఇదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. కేవలం కటౌట్లు, ఫ్లెక్సీలకే పరిమితం కాకుండా.. రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు సాయం, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాల్లో ఫ్యాన్స్ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో ఉత్సాహం పొందిన అభిమానులు, తమ హీరో స్ఫూర్తితో సామాజిక సేవలో సరికొత్త రికార్డులు సృష్టిస్తామని ప్రతినబూనారు. కరీంనగర్‌లో జరిగిన ఈ మీటింగ్‌కు ఆయా జిల్లాల ప్రతినిధులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. రాష్ట్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో తెలంగాణలో అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమనేలా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read- Hema: ఏంటి.. మంచు లక్ష్మి మంకీనా? హేమ ఇలా అనేసిందేంటి?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×