Smart Investing: ప్రతి ఒక్కరిలోనూ కోటీశ్వరులు కావాలని కోరిక ఉంటుంది. అయితే, అనేక మందికి దీని కోసం ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయాలు తెలియదు. మరికొంత మంది కేవలం సంపాదించి, ఆ డబ్బును ఎక్కడ, ఎలా పెట్టుబడి చేయాలని తెలియక ఉండిపోతారు. అలాంటి వారు 30 ఏళ్లలోపు చిన్న మొత్తాల ద్వారా సేవింగ్ అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో భారీ మొత్తాన్ని పొందవచ్చు. ఇది మీ ఆర్థిక భద్రతకు బేస్ ఫౌండేషన్ వేయడానికి కరెక్ట్ సమయమని చెప్పవచ్చు. ఈ దశలో సరైన ఆర్థిక నిర్ణయం మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. అయితే దీనికోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రణాళిక ప్రకారం
అందుకోసం SIP నెలవారీగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం బెస్ట్ ఛాయిస్. చిన్న మొత్తాలతో మొదలుపెట్టి, దీర్ఘకాలికంగా వాటిని కొనసాగించాలి. SIPలలో పెట్టుబడులు చక్రవడ్డీ ద్వారా రోజురోజుకు పెరుగుతూ, పెద్ద మొత్తాన్ని అందిస్తాయి. ఈ క్రమంలో రోజుకు రూ.100 అంటే నెలకు రూ.3000 వచ్చే 30 సంవత్సరాలు చేయడం ద్వారా మీరు రూ.4.5 కోట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇది మాయాజాలం ఏమి కాదు. కానీ కాంపౌండింగ్ మ్యాజిక్. ఇది సాధించాలంటే శ్రద్ధగా, ప్రణాళిక ప్రకారం పెట్టుబడి చేయాలి.
స్టెప్-అప్ SIP
మీ ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుంది కదా! అలాగే మీ పెట్టుబడి మొత్తాన్ని కూడా అదే రీతిలో పెంచడం చాలా అవసరం. దీన్నే Step-up SIP అంటారు. ఉదాహరణకి మీరు మొదటి సంవత్సరంలో రూ.3000 నెలకు పెట్టుబడి పెట్టారు అని తీసుకుందాం. కానీ రెండో సంవత్సరంలో దాన్ని రూ.,3300కి పెంచాలి. మూడో సంవత్సరంలో రూ.3630… ఇలా ప్రతి ఏడాది 10% పెంచుతూ వెళ్తే, మీరు పెట్టే మొత్తం నెమ్మదిగా పెరుగుతుంది. ఇది క్రమంగా మీ ఫైనాన్షియల్ లక్ష్యాలను అందించేందుకు సిద్ధమవుతుంది.
Read Also: Smartwatch Offer: బడ్జెట్ ధరల్లో ఫాస్ట్రాక్ ప్రీమియం ..
నెలవారీ ప్రారంభ పెట్టుబడి: రూ.3000
-స్టెప్ అప్ రేటు: 10% ప్రతి సంవత్సరం
-పెట్టుబడి వ్యవధి: 30 సంవత్సరాలు
-అంచనా వార్షిక రాబడి (CAGR): 15%
-మీ మొత్తం పెట్టుబడి: రూ. 59,21,785
-లాభం మాత్రమే: రూ.3,91,45,025
-మెచ్యూరిటీ సమయానికి వచ్చే మొత్తం : రూ. 4,50,66,809
పానీ పూరీ ఖర్చు
ఇది SIP అద్భుత ఫలితమని చెప్పవచ్చు. మీరు రెండు సార్లు పానీ పూరీ తింటే అయ్యే 100 రూపాయల ఖర్చును SIPలో పెట్టుబడి చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీరు నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేయండి మరి. ఒక వేళ మీరు స్టెప్-అప్ సిప్ చేయకున్నా కూడా నెలకు కేవలం రూ.3వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత మీకు రూ.కోటీ 68 లక్షలు లభిస్తాయి. ఆ క్రమంలో మీరు చేసే ఇన్వెస్ట్ మెంట్ కేవలం రూ.10 లక్షల 80 వేలు మాత్రమే కావడం విశేషం.
ఎందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్?
ఎందుకంటే ఇవి అధిక రాబడి ఇచ్చే అవకాశాలు కలిగిన పెట్టుబడి మార్గాలు. అయితే దీనిలో కొంత రిస్క్ ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో మార్కెట్ పతనాలను సమతుల్యం చేస్తూ మంచి రాబడిని అందిస్తాయి.
గమనిక: బిగ్ టీవీ పెట్టుబడి సమాచారం మాత్రమే అందిస్తుంది. పెట్టుబడి చేయాలని సలహాలు, సూచనలు అందించదు. మీకు ఆసక్తి ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.