Sweating In Summer: ఎండాకాలంలో చెమటలు పట్టడం సహజమే. కానీ ఈ చెమట వాసన మీకే కాకుండా మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని నివారించడానికి చాలా మంది పెర్ఫ్యూమ్‌లు, సువాసన గల సబ్బులు, డియోడరెంట్లు ఉపయోగిస్తారు. కానీ ఇది మీ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.
చెమట దుర్వాసన రావడానికి హార్మోన్ల మార్పులు, ఆహారం, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ తో మాటు ఇతర కారణాలు కూడా ఉంటాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. చెమట వాసన నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన , ప్రభావవంతమైన హోం రెమెడీస్ ట్రై చేయండి. వీటి ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరిశుభ్రత:
వేసవి కాలంలో రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేయండి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం తాజాగా ఉండి.. బ్యాక్టీరియా ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. స్నానం చేసిన తర్వాత.. శరీరాన్ని తుడిచుకుని బాగా ఆరనివ్వండి. తద్వారా తేమ వల్ల బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది.
యాంటీ బాక్టీరియల్ సబ్బు :
సాధారణ సబ్బుతో స్నానం చేయడానికి బదులుగా.. యాంటీ బాక్టీరియల్ సబ్బును వాడండి. ఇది బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్, మెడ , పాదాల వంటి భాగాలను బాగా కడగడం మర్చిపోవద్దు.
కాటన్ దుస్తులు:
వేసవిలో సింథటిక్ లేదా బిగుతుగా ఉండే దుస్తులకు బదులుగా కాటన్, వదులుగా ఉండే దుస్తులను ధరించడం ప్రయోజనకరం. కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుని చర్మం గాలి పీల్చుకునేలా చేస్తాయి. తద్వారా దుర్వాసన తగ్గుతుంది.
నిమ్మరసం వాడండి:
నిమ్మరసం సహజ దుర్గంధనాశనిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చంపుతుంది. అంతే కాకుండా చెమట దుర్వాసన కూడా రాకుండా చేస్తుంది. నిమ్మకాయను నేరుగా అండర్ ఆర్మ్స్ మీద రుద్దండి. లేదా నీటితో కలిపి వాడండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడా వాడండి:
బేకింగ్ సోడా కూడా చెమట వాసనను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది చెమటలోని తేమను గ్రహిస్తుంది. బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. దీన్ని నీటితో కలిపి అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేయండి. లేదా ప్రభావిత ప్రాంతంపై నేరుగా కొంచెం బేకింగ్ సోడా చల్లుకోండి.
Also Read: ఇంట్లోనే.. ఫేస్ సీరం తయారు చేసుకోండిలా ?
మారుతున్న వాతావరణంలో చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం, గ్లిజరిన్ , కలబంద అధికంగా ఉండే సల్ఫేట్ లేని క్లెన్సర్‌ను ఉపయోగించండి. ఇది చర్మాన్ని పొడిబారకుండా మురికిని తొలగిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, హైలురోనిక్ యాసిడ్, సెరామైడ్లు, నియాసినమైడ్ కలిగిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. ఇది చర్మం యొక్క సహజ అవరోధాన్ని బలంగా ఉంచుతుంది.
వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయండి. మృత కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు గ్లైకోలిక్ లేదా లాక్టిక్ యాసిడ్ వంటి తేలికపాటి రసాయన ఎక్స్‌ఫోలియంట్‌ను ఉపయోగించండి. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. వీటి ద్వారా చర్మ రంధ్రాలు కూడా మూసుకుపోవు.