Chandrababu Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ణయాలు తీసుకోవడంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టేవారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం అభివృద్ధితోపాటు సంక్షేమంపైనా ఫోకస్ చేశారు. తాజాగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త. బియ్యంతోపాటు తృణ ధాన్యాలను పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది. జూన్ ఒకటి నుంచి అమలు చేయాలని భావిస్తోంది.
రేషన్ కార్డుదారులకు శుభవార్త
ఏపీ వ్యాప్తంగా హెల్త్ సర్వే చేపట్టింది ప్రభుత్వం. ఏయే జిల్లాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇటీవల వివరించారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యమని వివరించారు కూడా. సర్వే ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
జూన్ ఒకటి నుంచి రేషన్ కార్డుదారులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. రేషన్‌తోపాటు తృణ ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. అందులో కీలకమైనది రాగులు ఒకటి. వీటిని పంపిణీ చేయాలని భావిస్తోంది. రేషన్ బియ్యానికి బదులు ఉచితంగా రాగులు ఇవ్వనుంది.
ప్రతినెలా 20 కిలోల బియ్యం తీసుకుంటున్న రేషన్ కార్డు హోలర్డ్ రెండు కేజీలు రాగులు కావాలని అడిగితే ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇచ్చే బియ్యాన్ని అందులో మినహాయించేలా ఆలోచన చేసింది. రాగులు తీసుకునేవారికి బియ్యం ఎన్ని కేజీలు తగ్గిస్తారనేది ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. రాగులు ఇవ్వడానికి కారణాలు లేకపోలేదు.
ALSO READ: బట్టలూడదీసి ఏం చూస్తావ్.. జగన్‌కు పోసాని పంచ్
హెల్త్ సర్వేలో చాలా సమస్యలు
చాలా జిల్లాల్లో ప్రజలు రక్త హీనత సమస్య ఎదుర్కొంటున్నారు. రాగుల వల్ల ఆ సమస్య తగ్గించ వచ్చని భావిస్తోంది. రాగులు తినడం వల్ల బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. రాగులు పండించే రైతులకు మేలు చేస్తుంది కూడా. దీనివల్ల రైతులు లాభం పొందుతారు.
రాయలసీమలో రాగులు సాగు ఎక్కువగా చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి రాగులు ఎంతమేర అవసరం అవుతుందో లెక్క కట్టింది. చివరకు దాదాపు 25 వేల మెట్రిక్ టన్నుల రాగులు కావాలని అధికారులు అంచనా వేశారు. కేంద్రప్రభుత్వం మిల్లెట్స్ వాడమని పదేపదే చెబుతోంది. పేదలకు బియ్యంతోపాటు రాగులను కూడా ఇవ్వాలని నిర్ణయించింది కూటమి సర్కార్.
రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అమైనో యాసిడ్స్ వీటి సొంతం. ఇవి ఆహారంగా తీసుకోవడం వల్ల చిన్నారుల నుంచి పెద్దల వరకు మరింత బలంగా ఉంటారు. ఎముకలు బలంగా ఉండడమే కాదు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని కొందరు వైద్య నిపుణుల మాట. ప్రోటీన్, విటమిన్ బి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలకు కొదవలేదు.
రాగులు రేటు ఎక్కువే
రాగులు చూడటానికి ఆవాలు మాదిరిగా ఎర్రగా ఉంటాయి. రాగులతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. మార్కెట్‌లో కేజీ రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. అదే బియ్యమైతే 40 నుంచి పైమాటే. రాగులు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని భావిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జూన్ నుంచి రాగులు ఇవ్వాలని నిర్ణయించింది.