Reduce Loan Interest Rates: ఇటీవల భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC, BOI సహా పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. వరుసగా రెండోసారి మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో రేటును తగ్గించడంతో ఆయా బ్యాంకులు సైతం స్పందించాయి. ఇది రుణగ్రహితలకు ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. అదే సమయంలో, FD పెట్టుబడిదారులు మాత్రం కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణం తీసుకోవాలా? లేక పొదుపుగా FD పెట్టాలా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య తరగతికి భారీ ఊరట
RBI తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన వెంటనే, SBI కూడా అదే దారిలో తన రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. ఏప్రిల్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా, బ్యాంకు తీసుకున్న ప్రధాన మార్పులు ఇవే:
Repo Linked Lending Rate (RLLR):
-మునుపటి రేటు: 8.50%
-ప్రస్తుతం: 8.25%
External Benchmark Based Lending Rate (EBLR):
-మునుపటి రేటు: 8.90%
-ప్రస్తుతం: 8.65%
దీని వల్ల లాభపడేవారు ఎవరు?
-ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారు – EMI లో తగ్గింపు.
-కొత్తగా రుణం కోసం ఎదురుచూస్తున్న వారు – తక్కువ వడ్డీకి రుణం పొందే అవకాశం.
-కార్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, పర్సనల్ లోన్లపై కూడా EMI భారం తగ్గుతుంది.
-ఇది ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల కోసం ఒక గొప్ప అవకాశం. EMI భారం తగ్గడం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది.
FD పెట్టుబడిదారులకు మాత్రం నిరాశ
-SBI తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను కూడా తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది పొదుపుదారులపై కొంత ప్రభావం చూపించనుంది.
-రూ.3 కోట్ల లోపు తాజా డిపాజిట్ల FD రేట్లు: 1-2 సంవత్సరాల FD: 6.90% నుంచి 6.80%
-2-3 సంవత్సరాల FD: 7.00% నుంచి 6.75%
-రూ.3 కోట్లకు మించిన FDలకు తాజా రేట్లు:
-180-210 రోజుల FD: 6.40%
-211 రోజులు – 1 సంవత్సరం FD: 6.50%
-ఇవి తక్కువ కాల FD పెట్టుబడిదారులకు ప్రభావితం చేసే అంశాలు. ఇకపై పొదుపుదారులు వడ్డీ రాబడి విషయంలో మరింత ఆలోచన చేసి ముందుకు సాగాలి.
Read Also: HP H150 Wireless Earbuds: రూ.499కే HP బ్రాండెడ్ …
గ్రీన్ ఇన్వెస్ట్మెంట్‌లకు మద్దతుగా
-SBI ప్రవేశపెట్టిన Green Rupee Term Deposit పథకం మీద కూడా చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి:
-1111, 1777, 2222 రోజుల FDలపై – ప్రస్తుత కార్డ్ రేటుతో పోల్చితే 10 బేసిస్ పాయింట్లు తక్కువ వడ్డీ ఇవ్వనుంది.
-ఇది పర్యావరణ స్నేహపూర్వక ప్రాజెక్టులకు పెట్టుబడులు సమకూర్చేందుకు రూపొందించిన FD పథకం. ఒకవేళ మీరు గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ పట్ల ఆసక్తి చూపితే, దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు.
వృద్ధులకు శుభవార్త – అమృత వృష్తి FD
సాధారణ పెట్టుబడిదారులకు FD రేట్లు తగ్గిపోతున్నా, సీనియర్ సిటిజన్లకు SBI స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన ‘అమృత వృష్తి FD’ పథకం (444 రోజులు), మంచి రాబడి ఇస్తోంది.
తాజా వడ్డీ రేట్లు:
-సాధారణ పెట్టుబడిదారులకు: 7.05%
-సీనియర్ సిటిజన్లకు: 7.55%
-సూపర్ సీనియర్లకు: 7.65%
-ఇది తక్కువ కాలపరిమితిలో భద్రమైన పెట్టుబడి కోరుకునే వృద్ధుల కోసం చాలా మంచి ఎంపిక.
రుణం vs FD – ఏది ఇప్పుడు మంచిది?
ఈ సందర్భంలో మీరు “రుణం తీసుకోవాలా లేక FD పెట్టాలా?” అని ఆలోచిస్తే, మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. క్రింద కొన్ని సూచనలు:
రుణం తీసుకోవడానికి ఇదే సరైన సమయం:
-మీరు కొత్తగా గృహ రుణం లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే.
-తక్కువ EMIలు మీ ఆదాయ వ్యవస్థకు సరిపోయేలా ఉంటే.
-మీ ప్రస్తుత రెంటల్ ఖర్చును హోమ్ లోన్ EMIగా మార్చుకునే యోచనలో ఉంటే.
FD పెట్టేందుకు తగిన సందర్భాలు:
-మీకు పెద్దగా రిస్క్ తట్టుకోలేని పరిస్థితి ఉంటే.
-మీరు సీనియర్ సిటిజన్ అయితే – ప్రత్యేక FD రేట్లు పొందవచ్చు.
-మీ పెట్టుబడికి భద్రత మరియు నిర్దిష్ట వడ్డీ రాబడి కావాలంటే.
స్ట్రాటజీ పాటించండి
ఇప్పుడు మీరు కావాలంటే ఒక చిన్న మొత్తాన్ని FDలో పెట్టి, మిగతా మొత్తాన్ని SIP లేదా ఇతర పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. అదే విధంగా, EMI చెల్లించాల్సిన రుణం ఉంటే, ఈ తగ్గింపును ఉపయోగించుకుని ముందస్తుగా కొంత మొత్తం చెల్లించండి.