Garuda Puranam: గరుడపురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల ఈ మూడు వస్తువులను అసలు వాడకూడదట. ఒకవేశ ఉపయోగిస్తే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రేతాత్మగా మారి ఆ వస్తువులు ఉపయోగించిన వ్యక్తిని చాలా కష్టాలు పెడుతుందట. అదీకాక ఆ ఆత్మకుఎప్పటికీ మోక్షం లభించదట. అయితే ఆత్మకు వస్తువులకు ఉన్నసంబంధంఏంటో..? అసలు గరుడపురాణం ఏం చెప్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పుదు. మరణించి వాళ్లు మళ్లీ పుట్టక తప్పుదు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు. అలాగే గరుడపురాణంలో కూడా శ్రీకృష్ణపరమాత్మ..చనిపోయిన వ్యక్తుల వస్తువులు ఉపయోగించకూడదని చెప్పారట. అయితే అందులో మూడు వస్తువులు అసలు తీసుకోకూడదని అవి తీసుకుని ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాలను కూడా గరుడపురాణంలో శ్రీకృష్ణుడు వివరించినట్టు పండితులు చెప్తున్నారు. చనిపోయిన తర్వాత మనిషి ఏ వస్తువులను తనతో తీసుకెళ్లలేడు. కేవలం తాను చేసిన పాప పుణ్యాలను మాత్రమే తీసుకెళ్తాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే భూమ్మీద పుట్టిన ప్రతిమనిషి చేసిన పుణ్యాలకంటే పాపాలే ఎక్కువగా ఉంటాయని.. ఎప్పడైతే ఆత్మ శరీరంతో జతకలిసి భౌతిక సుఖాలకు అలవాటు పడుతుందో అప్పుడే పాపకర్మలు ఎక్కువగా చేస్తారని.. మరణించిన తర్వాత కూడా ఆ మనిషి ఆత్మ భౌతిక సుఖాల కోసం భూమ్మీదే తిరుగుతుందని.. ఈ క్రమంలోనే చనిపోయిన వ్యక్తి యొక్క మూడు వస్తువులను ఉపయోగిస్తే ఆత్మ ప్రతికూలశక్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.
చెప్పులు, దువ్వెన: చనిపోయిన వ్యక్తి యొక్క చెప్పులను, దువ్వెనను ఎవ్వరూ ఎప్పుడూ వాడకూడదు. ఎందుకంటే గరుడపురాణం ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి యొక్క నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ చెప్పులు, దువ్వెనలో ఉటుందని పండితులు చెప్తున్నారు. అటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్న వాటిని ఉపయోగించడం వల్ల వాటిలోని నెగటివ్ ఎనర్జీ ఉపయోగించిన వ్యక్తికి వస్తుందట. మరణించిన వ్యక్తి కూడా ప్రతికూలశక్తిగా మారి బాధిస్తాడని చెప్తున్నారు.
అభరణాలు: గరుడపురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన నగలు, అభరణాలు ధరించకూడదు. వాటిని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క శక్తి లేదా ఆత్మ తన అభరణాలు ధరించిన వ్యక్తిని ఆవహిస్తుంది. అలా జరగకూడదని భావిస్తే ఎంచేయాలో గరుడపురాణంలో ఉందని పండితులు చెప్తున్నారు. ఎవరైనా చనిపోయిన వ్యక్తి నగలు ఉపయోగించాలనుకుంటే వాటిని కరిగించి కొత్తగా అభరణాలు చేయించుకుని వాడొచ్చని చెప్తున్నారు. అయితే మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన నగలను మీకు బహుమతిగా ఇస్తే ఎటువంటి సమస్య ఉండదంటున్నారు.
దుస్తులు: గరుడపురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క దుస్తులు ఎవ్వరూ ధరించకూడదట. ఒకవేళ ధరిస్తే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ దుస్తులు ధరించిన వ్యక్తితో ముడిపడుతుందట. ఆత్మయొక్కఆలోచనలు ఆ వ్యక్తిని హింసిస్తాయట. దీంతో ఆ వ్యక్తి శారీరకంగానూ, మానసికంగానూ కుంగిపోతాడట. అయితే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు దానంచేయాలట. దీని వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని గరుడపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.
అయితే చనిపోయిన వ్యక్తికి చెందిన వస్తువులను ఆయన గుర్తుగా ఇంట్లో దాచుకోవచ్చు. లేదంటే ఏదైనా నదిలో కలిపేయాలని గరుడపురాణంలో ఉందట. అలా కాకుండా ఆ వస్తువులను ఎవరైనా ఉపయోగిస్తే.. మరణించిన వ్యక్తి ఆత్మ ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుందని గరుడపురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు