Hair Problems: నేటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మన ఆరోగ్యం చాలా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా జుట్టు కూడా దెబ్బతింటుంది. అందుకే జుట్టు సంబంధిత సమస్యలు తగ్గించడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం చాలా మంచిది. వీటిని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయలు:
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మీ జుట్టు సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును పెంచడానికి సహాయపడుతుంది.
ఎలా వాడాలి ?
ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి, వాటి నుండి రసాన్ని తీయండి. ఈ రసాన్ని తలకు పట్టించి 15 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే కాస్త వెల్లుల్లి రెబ్బలను నలగగొట్టండి.
దానికి కొంచెం కొబ్బరి నూనె వేసి కలపాలి. మరిగించి చల్లారనివ్వండి. తర్వాత దీనిని మీ తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.
కొబ్బరి నూనె:
మీ జుట్టు సంరక్షణ విషయానికి వస్తే.. కొబ్బరి నూనెను ఉపయోగించడం జుట్టుకు చాలా మంచిది. కొబ్బరికాయలో మీ జుట్టుకు పోషణనిచ్చే అనేక అంశాలు ఉంటాయి. కొబ్బరి నూనెతో మీ జుట్టును క్రమం తప్పకుండా మసాజ్ చేయండి. దీనితో పాటు, కొబ్బరి పాలు మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వీటి ద్వారా కొవ్వు , ప్రోటీన్లను కూడా అందుతాయి. దీని కోసం.. మీరు కొబ్బరి పాలను కొంచెం నీటితో కలిపి బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. మీరు కొన్ని రోజుల్లో ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు.
హెన్నా వాడకం:
హెన్నా జుట్టుకు సహజ రంగుగా పనిచేస్తుంది. మీ జుట్టు తెల్లగా మారడం ప్రారంభమయితే.. హెన్నాను ఉపయోగించవచ్చు. హెన్నాను ఆవ నూనెతో కలిపి వాడితే.. మంచి ఫలితం ఉంటుంది.
ఎలా వాడాలి ?
హెన్నాలో కాస్త నీరు పోసి మిక్స్ చేసి దానిని జుట్టుకు అప్లై చేయండి. కొంత సమయం తర్వాత, జుట్టును షాంపూతో వాష్ చేయండి.
ఉసిరి :
ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీ జుట్టు రాలిపోతుంటే లేదా పలుచబడుతుంటే మీరు ఉసిరిని జుట్టుకు తప్పకుండా వాడాలి. దీన్ని తలకు రాసుకోవడమే కాకుండా.. ప్రతిరోజూ తినడం వల్ల మీ తల, జుట్టుకు కూడా మేలు జరుగుతుంది.
ఎలా వాడాలి ?
ఉసిరి పొడిని కూడా మీరు జట్టుకు వాడవచ్చు. ఇప్పుడు ఆ పొడిని రెండు చెంచాల ఉసిరి రసంలో కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కొంత సమయం తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జట్టు రాలకుండా కూడా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.
Also Read: ఇవి వాడితే.. తలమోయలేనంత జుట్టు
ఎగ్స్:
గుడ్డు కూడా సల్ఫర్ కు మంచి మూలం. గుడ్లలో ఐరన్, జింక్, అయోడిన్, సెలీనియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి మీ జుట్టుకు మేలు చేస్తాయి.
ఎలా వాడాలి ?
ఒక గుడ్డు తీసుకొని దానిలోని తెల్లసొనను వేరు చేయండి. దానికి ఒక చెంచా ఆలివ్ నూనె కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి. తర్వాత దీనిని మీ తలపై 15 నుండి 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది.