Investment Plan: ప్రస్తుతం దేశంలోని అనేక మంది ప్రజల్లో పెట్టుబడులు చేసే ధోరణి మారిపోయింది. సాధారణ FDలతో పోలిస్తే, కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు కానీ, అధిక రిటర్న్స్ వచ్చేవి కావాలని అంటున్నారు. ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి SBI PSU డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. SBI PSU డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనేది మ్యూచువల్ ఫండ్ ఆప్షన్. ఈ ఫండ్ ఉద్దేశం ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీల (PSUs) స్టాక్స్‌లో పెట్టుబడులు చేయడం.
ఈ ప్లాన్ మ్యూచువల్ ఫండ్ వృద్ధి పథకం కావడంతో, దీని ద్వారా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. 2019 నుంచి 2022 వరకు ఈ ఫండ్ 30% పైగా రిటర్న్స్ అందించింది. ఇది సాధారణ పెట్టుబడిదారులకు మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ ఫండ్ ప్రధానంగా పెరుగుతున్న ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి, వాటి ద్వారా లాభాలు పొందే అవకాశం కల్పిస్తుంది. ప్రత్యేకంగా పబ్లిక్ సెక్టార్ సంస్థల వృద్ధిపై ఫోకస్ చేస్తుంది. దీంతో SBI PSU డైరెక్ట్ ప్లాన్ ఫండ్ ప్రాఫిటబుల్‌గా మారిపోయింది.
Read Also: AC Prices Soar: షాకింగ్.. త్వరలో పెరగనున్న ఏసీల ధరలు, కారణమిదేనా..
అయితే ఈ స్కీంలో దీర్ఘకాలంలో పెట్టుబడులకు మరింత లాభాలు వస్తాయి. ఉదాహరణకు దీనిలో నెలవారీ SIP ద్వారా SBI PSU ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారు కూడా మంచి లాభాలను ఆర్జించారు. ఒకవేళ ఈ ఫండ్‌లో మీరు 3 సంవత్సరాల పాటు నెలకు రూ. 10,000 చొప్పున SIP చేసి ఉంటే, మీకు మూడేళ్ల తర్వాత రూ. 4,35,076.471 లభించేవి. అంటే మీరు చేసిన పెట్టుబడి మొత్తం రూ. 3.60 లక్షలు మాత్రమే.
ఒకవేళ మీరు ఐదేళ్ల కాలానికి రూ. 10,000 SIP ప్రారంభించి ఉంటే, మీకు వచ్చే మొత్తం రూ. 8,24,863.666 లక్షలు అవుతుంది. మీరు చేసిన పెట్టుబడి రూ. 6 లక్షలు మాత్రమే. ఇదే SIPని మీరు 15 సంవత్సరాల పాటు ప్రారంభించినట్లయితే, మీకు లభించేది రూ. 50,45,759.995 అవుతుంది. అంటే మీరు చేసే పెట్టుబడి రూ.12 లక్షలు కాగా, మీకు లభించేది మాత్రం 50 లక్షలు. అంటే మీరు చేసిన పెట్టుబడి మొత్తానికి దాదాపు నాలుగు రెట్లు వస్తుందని చెప్పవచ్చు. ఈ రాబడులు సగటున 12 శాతం వార్షిక రాబడి ప్రకారం లెక్కించారు. ఒకవేళ మీకు సగటు కంటే ఎక్కువ రాబడి వస్తే ఇంకా అధిక మొత్తం వచ్చే ఛాన్సుంది.