Chhaava OTT:గత నెల రోజులుగా ఎక్కడ చూసినా ఛావా సినిమా గురించే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky kaushal), ఆయన భార్య యేసు భాయ్ పాత్రలో రష్మిక మందన్న (Rashmika Mandanna) చాలా అద్భుతంగా ఒదిగిపోయి మరీ నటించారు. బాలీవుడ్ లో ఇప్పటికే విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసి, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉండడం గమనార్హం.
Pushpa 2: షాక్ లో పుష్ప టీమ్.. హైకోర్టులో మరో పిటిషన్..!
ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయిన ఛావా డిజిటల్ హక్కులు..
తెలుగులో మార్చి 7వ తేదీన గీత ఆర్ట్స్ బ్యానర్ వారు విడుదల చేయడం జరిగింది. లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman Utkar) దర్శకత్వంలో.. మాడాక్ ఫిలిం బ్యానర్ పై దినేష్ విజన్ ఈ సినిమాని నిర్మించారు.శివాజీ సావంత్ మరాఠీ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇకపోతే థియేటర్లలో చూడలేని వారు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండగా.. మరొకవైపు థియేటర్లో చూసిన వారు కూడా మళ్లీ ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది .ముఖ్యంగా ఫ్యాన్సీ రేటుకే ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..
ఇకపోతే ఏప్రిల్ 11వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్ వేదికగా.. ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు మరింత హైప్ రావడంతో పాటు క్రేజ్ తగ్గకపోవడంతో ఓటీటీ రిలీజ్ లేట్ అయ్యే అవకాశం ఉందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య థియేటర్లలో ఊహించని కలెక్షన్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా అటు ఓటిటిలో ఎలాంటి రేటింగ్ను దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఛావా సినిమా విషయానికి వస్తే.. ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది .ముఖ్యంగా చారిత్రకతను మళ్ళీ నేటితరం యువతకు తెలియజేస్తూ పెద్దలను, పిల్లలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.బాలీవుడ్ లోనే రూ.1000 కోట్ల దిశగా అడుగులు వేస్తున్న ఈ సినిమా ఇటు తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొత్తానికి అయితే ఫుల్ రన్ ముగిసే సరికి సుమారుగా రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇందులో రష్మిక మందన్న ఒదిగిపోయి మరీ నటించింది తన అద్భుతమైన నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాకి ముందు యానిమల్ , పుష్ప2 సినిమాలలో నటించి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికి అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఛావా సినిమా హవా కొనసాగుతూ ఉండడం గమనార్హం.