పిల్లలు ఏ పని చేసినా చాలా ముద్దొస్తుంది. తెలిసీ తెలియని వయసులో వాళ్లు చేసే అల్లరి చేష్టలు ఆకట్టుకుంటాయి. కొన్నిసార్లు కోపం తెప్పిస్తాయి. అదే సమయంలో నవ్వును పుట్టిస్తాయి. కొంత మంది పిల్లలు చేసే పని భయం కలిగిస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఈ ఘటన కూడా. కొంత మంది పిల్లలు ఏకంగా పాముతోనే తాడాట ఆడటం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాముతో గేమ్స్ ఏంట్రా?
సాధారణంగా పాము కనిపిస్తేనే భయంతో వణుకు పుడుతుంది. చిన్న పిల్లలు కూడా పాము ను చూస్తే భయం దూరంగా పారిపోతారు. కానీ, కొంత మంది పిల్లలు పాములతో ఆడుకున్న విజువల్స్ ను తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాంటి వీడియో గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం.. కొంత మంది పిల్లలకు సుమారు ఆరు అడుగుల పొడవున్న పాము కనిపించింది. నిజానికి చాలా మంది పాము దగ్గరికి వెళ్లే ప్రయాణం చేయరు. చివరకు చనిపోయిన పాము అయినా దాని దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించరు. కానీ, వీళ్లు మామూలు పిల్లలు కాదు. చిచ్చర పిడుగులు. వీళ్లలో భయం ఏ కోశాన కనిపించడం లేదు.
పాముతో తాడాట ఆడిన పిల్లలు
ఆ పిల్లలు పామును తాడు మాదిరిగా భావించి తాడాట ఆడటం మొదలు పెట్టారు. పాము తల ఒకరు, తోక మరొకరు పట్టుకుని తిప్పుతుండగా, మరికొంత మంది ఎగురుతూ కనిపించారు. పాముతో ఆ పిల్లలు స్కిప్పింగ్ ఆడుతుంటే కనీసం పేరెంట్స్ కూడా వద్దని వారించే ప్రయత్నం చేయడం లేదు. పైగా ఎంకరేజ్ చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అయితే, ఆ పామును చూస్తుంటే ప్రాణాలతో లేనట్లుగా కనిపిస్తోంది. అప్పుడే చంపిన పామును అలా పట్టకుని ఆడుతున్నట్లుగా చాలా మంది భావిస్తున్నారు.
https://www.instagram.com/autelugu_films/reel/DG36zw7TN3v/
Read Also: పాపం.. విమానం దిగే వరకు ఉగ్గబెట్టుకుని కూర్చున్న ప్రయాణీకులు.. అసలు ఏమైంది?
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ వీడియో ఆస్ట్రేలియన్ తెలుగు ఫిల్మ్స్(Australian Telugu Films) అనే అకౌంట్ ద్వారా షేర్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. కొంత మంది పిల్లలు చేస్తున్న పనిని తీవ్రంగా తప్పుబడుతుండగా, మరికొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పాము బతికి ఉన్నా, చనిపోయినా పిల్లలు అలా పట్టుకోవడం ప్రమాదకరం అంటున్నారు. వారి తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా వదిలేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాటేస్తే పోతార్రోయ్ అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది పిల్లల ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. పాముతో తాడాట ఆడుతున్నారంటే, వీళ్ల గుండె చాలా పెద్దదే అని ప్రశంసిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read Also: గుట్కా ఉమ్ములతో ఎర్రబడ్డ ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో చెప్పుకోండి.. బీహార్ కాదు!
Read Also: రన్నింగ్ ట్రైన్ లో నుంచి కింద పడబోయిన మహిళ.. కాపాడిన రైల్వే పోలీస్!