BigTV English

Pawan Kalyan Wishes to Ram Charan: అవే చరణ్ కు శ్రీరామరక్ష.. అబ్బాయ్ పుట్టినరోజున బాబాయ్ స్పెషల్ పోస్ట్!

Pawan Kalyan Wishes to Ram Charan: అవే చరణ్ కు శ్రీరామరక్ష.. అబ్బాయ్ పుట్టినరోజున బాబాయ్ స్పెషల్ పోస్ట్!


Pawan Kalyan Special Wishes to Ram Charan on his Birthday: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 39 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. గత వారం రోజుల నుంచే చరణ్ పుట్టినరోజు వేడుకల గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. ఇక నేడు చరణ్ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అయ్యింది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా  బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

పవన్- చరణ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచి చరణ్ ను పెంచింది  పవనే. ఈ విషయాన్నీ ఎన్నోసార్లు చరణ్, పవన్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. చిరు షూటింగ్ వెళ్లిపోవడంతో సురేఖ .. చరణ్ బాధ్యత తనకు అప్పగించేదని, పైకి కనిపించడు కానీ.. చరణ్ చాలా అల్లరి చేసి తనకు నిద్రలేకుండా చేసేవాడని పవన్ చెప్పుకొచ్చారు. ఇక  చరణ్ కూడా బాబాయ్ అంటే ప్రాణం. ఎన్నోసార్లు దాన్ని నిరూపించాడు కూడా. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా అబ్బాయ్ పుట్టినరోజును మర్చిపోలీకుండా  ఎక్స్ ద్వారా తన ఆశీర్వాదాలను పంపారు.


Also Read: RC 16: రామ్ చరణ్ ‘ఆర్సీ 16’ నుంచి క్రేజీ అప్డేట్ అందించిన దర్శకుడు.. వీడియో వైరల్

“ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని… సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్ధిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి… మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×