Gold Vs Silver: ఇటీవల బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి పెరిగిపోయాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాములకు రూ. 92,150కి చేరుకోగా, వెండి ధర కిలోకు రూ. 1,03,000 చేరుకుంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ పెరుగుదల కొనసాగి 10 గ్రాముల బంగారం రూ. 99,000 వరకు చేరే అవకాశం ఉంది. మరి, ఈ పెరుగుదల ఎందుకు జరుగుతోంది? బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయా? ఇప్పుడు పెట్టుబడిదారులు ఏం చేయాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
-ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అస్థిరతలు మారుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, యూరోపియన్ యూనియన్, కెనడాపై దిగుమతి సుంకాలు, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు వంటి పరిణామాలు బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.
-వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. దీంతో కూడా బంగారం ధర పెరుగుతోంది.
-స్టాక్ మార్కెట్లు అనిశ్చిత పరిస్థితిలో ఉండటంతో, పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు.
-రూపాయి మారకపు విలువ తగ్గినప్పుడు కూడా బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
-అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
బంగారం 99,000కి ఎప్పుడు చేరుకుంటుంది?
HDFC సెక్యూరిటీస్ కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా ప్రకారం, 2026 చివరి నాటికి బంగారం రూ. 99,000కి చేరుకోవచ్చు. అలాగే, వెండి ధర రూ. 1.25 లక్షలకు చేరే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: ATM Charges: ఏటీఎం క్యాష్ తీసుకుంటే 23 రూపాయల ఛార్జ్ ..
ప్రస్తుత పెట్టుబడి మార్కెట్‌లో బంగారం, వెండి రాబడులు ఎలా ఉన్నాయి?
-2024-25 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2024 – మార్చి 2025) వివిధ పెట్టుబడుల రాబడులను పరిశీలిస్తే:
-బంగారం: 31.37% రాబడి
-వెండి: 35.56% రాబడి
-నిఫ్టీ 50: 5.29% రాబడి
-సెన్సెక్స్: 4.96% రాబడి
-బ్యాంక్ నిఫ్టీ: 9.16% రాబడి
-ముడి చమురు: -13.69% నష్టాలు
ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టాలా?
-గోల్డ్ ETF: బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటే, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) మాధ్యమంగా పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇది భద్రతతో పాటు లిక్విడిటీని అందిస్తుంది.
-గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds – SGBs): ఈ బాండ్లు సురక్షిత పెట్టుబడి ఎంపిక, ప్రభుత్వ హామీ కలిగినవి.
-ఫిజికల్ గోల్డ్ (భౌతిక బంగారం): పెళ్లిళ్లు, దీర్ఘకాల పెట్టుబడి కోసం భౌతిక బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే, మార్కెట్ ధరలు అధికంగా ఉన్నందున కాస్త వేచిచూడడం మంచిది.
వెండిలో పెట్టుబడి పెట్టాలా?
అనుజ్ గుప్తా ప్రకారం, బంగారం కంటే వెండిలో పెట్టుబడి పెట్టడం మంచి ఛాయిస్ అన్నారు. ఎందుకంటే వెండి ధర రూ. 1.25 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. అలాగే, పారిశ్రామిక వినియోగం పెరుగుతున్న కారణంగా వెండికి డిమాండ్ ఇంకా పెరుగుతుందన్నారు.
భవిష్యత్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయి?
ICICI బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక ప్రకారం, 2025 ద్వితీయార్థంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 94,000-96,000 వరకు చేరే అవకాశం ఉంది. అయితే, వాణిజ్య యుద్ధాలు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లపై ఆధారపడి ధరల్లో మరింత పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా, బంగారం, వెండి కొనుగోలు సామాన్యులకు కష్టంగా మారుతోంది.