Plane Crash: అమెరికా మిన్నియాపోలిస్‌లో ఓ విమానం ఓ ఇంటిపై కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్నవారు బయట పడినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం అయోవా నుంచి మిన్నెసోటా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇల్లు మాత్రం మంటల్లో కాలి బూడిదయ్యింది.
విమానం కుప్పకూలడంతో ఇల్లు అగ్నికి ఆహుతైన వీడియోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. అక్కడే ఆ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తుండడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు సంబంధిత అధికారులు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఉదయం సుమారు ఐదున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఐయోవా నుండి మిన్నెసోటాకు వెళ్తోంది ఓ విమానం. అయితే బ్రూక్లిన్ పార్క్ సమీపంలోని మిన్నియాపోలిస్ శివారులోని ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. విమానం కూలిపోవడంతో ఒకరు మరణించాడు. ఇల్లు మొత్తం ధ్వంసమైంది. ఆపై అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారు తప్పించుకున్నారు. వారంతా క్షేమంగా బయటపడ్డారు. ఏడుగురు వ్యక్తులు కూర్చోగల సింగిల్ ఇంజన్ SOCATA TBM7లో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సివుంది. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తెలిపింది.
ALSO READ: ఆమె ఓపికకు జోహార్లు.. 66 ఏళ్ల వయస్సులో 10 బిడ్డకు జన్మ
డెస్ మోయిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఈ విమానం అనోకా కౌంటీ-బ్లెయిన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి వుంది. అయితే మార్గమధ్యలో కూలిపోయింది. ఈ ఘటనపై ఎవరూ ప్రాణాలతో బయట పడలేదని సమాచారం. ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సివుంది.
మంటల్లో చిక్కుకోవడంతో పాటు సమీపంలోని ఇళ్లకు భారీ నష్టం వాటిల్లిందని స్థానిక మీడియా చెబుతోంది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై బ్రూక్లిన్ పార్క్‌లోని అధికారులతో మాట్లాడుతున్నట్లు మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
అయితే విమానం ఘటనకు కొన్ని గంటల ముందు ముందు బ్రూక్లిన్ పార్క్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. గంటల వ్యవధిలో మంటలు అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. అక్కడి నుంచి సిబ్బంది వెళ్తున్న క్రమంలో విమానం ఘటన జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో వారంతా బయటకు రావడం, అప్పుడే విమానం కూలిపోవడం జరిగింది. ఈ ఏడాది మొదలు అమెరికాలో తరచు విమానాలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల కిందట గాల్లో రెండు విమానాలు ఢీకొన్న సంగతి తెల్సిందే.
ALSO READ: మయన్మార్ కు భారత్ సాయం.. మొదలైన ఆపరేషన్ బ్రహ్మ
Un #avión se estrelló contra una casa en #BrooklynPark, #Minnesota, provocando un incendio que consumió la vivienda por completo. Las autoridades informaron que no hubo heridos entre los ocupantes de la casa, pero aún se desconoce el estado de las personas a bordo del avión.
📷:… pic.twitter.com/DwWd8pSZVA
— Janeth León M (@janethleontv) March 29, 2025