ATM Charges: మీరు అనేక సార్లు ATM వాడుతుంటారా. అయితే మీకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే మే 1, 2025 నుంచి ATM లావాదేవీలపై కొత్త రుసుములు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న ఛార్జీలను పెంచి, ఉచిత లావాదేవీల పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీపై 23 రూపాయలు వసూలు చేయనున్నారు. ఈ మార్పు గురించి పూర్తిగా తెలుసుకుని జాగ్రత్తగా విత్ డ్రా చేసుకోవడం మంచిది. లేదంటే అందుకు సంబంధించిన రుసుము చెల్లించాల్సి వస్తుంది.
అసలు ATM చార్జీలు ఎందుకు పెంచారు..
ATM నిర్వహణ, భద్రత, మెయింటెనెన్స్, క్యాష్ నింపడం లాంటి ఖర్చులు పెరిగిన కారణంగా, బ్యాంకులు ఆ రుసుమును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఈ మార్పును ఆమోదించింది. ఇప్పటికే ATM చార్జీలు ఉన్నప్పటికీ, ఈ పెంపుతో కస్టమర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది.
Read Also: 5G Smartphone Offer: టాప్ బ్రాండ్లకు పోటీగా కొత్త మోడల్.. .
ఉచిత లావాదేవీల పరిమితి తెలుసా మీకు
-మీ బ్యాంకు ATM నుంచి మీరు నెలలో 5 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్-ఫైనాన్షియల్) చేయవచ్చు.
-మెట్రో నగరాల్లో బ్యాంకు ATM ఉంటే 3 ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేస్తే రూ. 23 మీ ఖాతా నుంచి కట్ అవుతుంది. మెట్రో కాకుండా ఉన్న నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు.
-ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రస్తుతం, ప్రతి లావాదేవీకి రూ. 21 వసూలు చేస్తున్నారు. మే 1, 2025 నుంచి ఇది రూ. 23 కానుంది.
నగదు రీసైక్లర్ యంత్రాలకు కూడా వర్తిస్తుందా?
అవును, ఈ మార్పులు నగదు రీసైక్లర్ యంత్రాలకు (Cash Recycler Machines – CRM) కూడా వర్తిస్తాయి. కనుక, మీ బ్యాంకు ATM అయినా, CRM అయినా – లావాదేవీల పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తాయి.
ATM ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే ఏమిటి?
మీరు వేరే బ్యాంకు ATM ఉపయోగించినప్పుడు, మీ బ్యాంకు ఆ ATM బ్యాంకుకు ఒక ఫీజు చెల్లిస్తుంది. ఉదాహరణకి:
మీరు SBI కస్టమర్ అయితే, PNB ATM నుంచి డబ్బు తీసుకున్నట్లయితే, SBI, PNBకి ఒక ఫీజు చెల్లిస్తుంది. ఉచిత పరిమితి దాటిన తర్వాత, SBI ఆ లావాదేవీ కోసం రూ. 23 పే చేస్తుంది.
కొత్త ఛార్జీల ప్రభావం ఎవరికెంత?
-తరచుగా ATM వినియోగించే వారికి ప్రతీ నెల ఉచిత పరిమితిని దాటితే, అదనపు ఖర్చు ఎక్కువవుతుంది.
-లావాదేవీలు ఎక్కువగా చేసే వ్యాపారులు రోజూ లేదా తరచుగా డబ్బు ఉపసంహరించుకునే వారు ముందుగా ప్లాన్ చేసుకోవాలి.
అధిక ఛార్జీలను ఎలా మించుకోవచ్చు?
డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా ఉపయోగించండి. UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను వాడండి. ATM లావాదేవీలను ప్లాన్ చేసుకోండి. అవసరానికి మించి డబ్బు విత్‌డ్రా చేయకుండా చూసుకోండి. మీ బ్యాంకు ATMనే ఎక్కువగా ఉపయోగించండి. వేరే బ్యాంకు ATMలు వాడితే పరిమితి తక్కువ ఉంటుంది. కొత్త ఛార్జీలు 2025 మే 1 నుంచి అమలులోకి వస్తాయి. బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోండి.