2025 జనవరి 27.
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ వేశారు.
ఫిబ్రవరిలో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోతాయని చెప్పారు.
ఆయన అన్నట్టే ఇప్పుడు జరిగింది. కాస్త లేటయిందేమో కానీ, జరిగింది మాత్రం పక్కా. అవును అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ లను ప్రకటించడంతో దాదాపుగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్ లో కూడా మదుపర్ల సంపద లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. దీంతో ఇప్పుడు రాబర్ట్ కియోసాకి మరోసారి వార్తల్లోకెక్కారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్. పర్సనల్ ఫైనాన్స్, పేరెంటింగ్ గురించి ఈ బుక్ చక్కగా వివరిస్తుంది. ఇక ఆ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1997లో ఆయన ఈ పుస్తకం రాసినా.. ఇప్పటి పరిస్థితులకు కూడా ఇది చక్కగా సరిపోతుంది. రాబర్ట్ కియోసాకి 2002లో కూడా ప్రపంచ మార్కెట్ల పతనంపై కొన్ని హెచ్చరికలు చేశారు. ప్రపంచమంతా మాంద్యం గుప్పెట్లో చిక్కుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు దాదాపు అవే పరిస్థితులు నెలకొన్నాయి.
భవిష్యత్ వాటిదే..
భారతీయ సంప్రదాయ పెట్టుబడులు.. పొలాలు, స్థలాలు, బంగారం వంటి లోహాలు. కానీ విదేశీయులు ఎక్కువగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులనే సంప్రదాయ పెట్టుబడులుగా భావిస్తారు. మాంద్యం సమయంలో స్టాక్స్ జోలికి పోవద్దని, డాలర్ ని అసలే నమ్ముకోవద్దని అంటున్నారు రాబర్ట్ కియోసాకి. భవిష్యత్ అంతా బంగారం, వెండి, బిట్ కాయిన్ లదేనని చెబుతున్నారాయన. వీలైతే వెండి కొనండి, కనీసం ప్రతి ఒక్కరూ ఒక ఔన్స్ అంటే దాదాపు 30 గ్రాముల వెండిని కొనండి, భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు.
వెండి ధర రెట్టింపు..
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని, వాటిపై పెట్టుబడి పెట్టాలని రాబర్ట్ కియోసాకి చెబుతున్నా.. అందులో వెండి విషయాన్ని ఆయన నొక్కి మరీ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వెండి ధర, అతి కొద్ది సమయంలోనే రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక డాలర్ ని నమ్ముకోవడం కంటే, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టడం సేఫ్ అని సలహా ఇస్తున్నారు.
Q: Is SILVER more VALUABLE than gold or Bitcoin?
A: I say yes.
BECAUSE: Deman for silver is increasing for use in:
1: Solar Panels
2: Eelectronic Vehicles
3: Computers
4: Electronic products
5: Weapon Systems
6: Medicine
7:…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 2, 2025
ట్రంప్ విధించిన టారిఫ్స్ పై కూడా ఇటీవల పలు సందర్భాల్లో రాబర్ట్ కియోసాకి స్పందించారు. ట్రంప్ సుంకాలు పెంచడాన్ని చికెన్ ఛాలెంజ్ గేమ్ తో ఆయన పోల్చారు. ఎవరు ఎవరికి లొంగిపోతారో వేచి చూడాలన్నారు. ట్రంప్ నిర్మయాల వల్ల అమెరికా ద్రవ్య వ్యవస్థ మనుగడ సాగించకపోవచ్చని అన్నారు. ట్రంప్, మస్క్ చనిపోతున్న డాలర్ ని కాపాడగలరా అని ప్రశ్నించారు. ఆ విషయం తనకు తెలియదని, కాలమే చెబుతుందన్నారు కియోసాకి.
The TEXAS CHAINSAW MASSACRE is an old movie.
Today there is a new horror show known as PRESIDENT TRUMP and ELON MUSKS’ DOGE CHAINSAW MASSACRE
While I feel for the millions who are losing their jobs….something had to be done….and Trump and Musk are doing it.
Even Warren…
— Robert Kiyosaki (@theRealKiyosaki) April 7, 2025
కియోసాకి మాటలు అక్షర సత్యాలుగా మారడంతో అందరూ ఆయన పుస్తకాలను తిరగేస్తున్నారు, లేటెస్ట్ ట్వీట్లను ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పినట్టు స్టాక్స్ నుంచి డబ్బులు తీసేసి బంగారం, వెండిపై పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నారు. మార్కెట్లను అంచనా వేయడం కష్టసాధ్యమే అయినా కియోసాకి మాటల్ని మాత్రం చాలామంది బలంగా నమ్ముతుండటం విశేషం.