Kartik Aaryan: బాలీవుడ్‌లో అసలు నెపో కిడ్స్‌కు తప్పితే ఇంకెవరికీ స్థానం ఉండదని, ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి హీరోలు అయినా కూడా వారిని ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ చేయరని బీ టౌన్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తుంటాయి. వారు చెప్పినట్టుగానే ఇప్పటికే చాలామంది నెపో కిడ్సే యాక్టింగ్ సరిగా రాకపోయినా హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. అలాగే వారితో పోటీపడడానికి కొందరు టాలెంట్ ఉన్నా బ్యాక్‌గ్రౌండ్ లేని యాక్టర్లు కూడా ఉన్నారు. అందులో కార్తిక్ ఆర్యన్ ఒకరు. కానీ కార్తిక్ ఆర్యన్ గురించి తరచుగా బీ టౌన్‌లో ఏదో ఒక నెగిటివ్ కామెంట్ వినిపిస్తూనే ఉంటోంది. దానిపై ఈ యంగ్ హీరో తాజాగా స్పందించాడు.
నా గురించే ఎందుకు.?
ఒకప్పుడు నెపో కిడ్స్ సినిమాలకు పోటీగా తన సినిమాలను విడుదల చేసి ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు కార్తిక్ ఆర్యన్. ఇప్పటికీ అదే సక్సెస్ స్ట్రీక్‌ను మెయింటేయిన్ చేస్తున్నాడు. దాని వల్లే కార్తిక్ ఆర్యన్‌కు డిమాండ్ బాగా పెరిగిందని, అందుకే రూ.50 కోట్లు రెమ్యునరేషన్ అడుగుతున్నాడని బీ టౌన్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. దానిపై ఈ హీరో తాజాగా స్పందించాడు. ‘‘ఇంత రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ నేను ఒక్కడినేనా? అంత రెమ్యునరేషన్ తీసుకున్న వేరేవాళ్ల గురించి రాయలేరు. నా గురించి మాత్రమే రాస్తారు’’ అంటూ సీరియస్ అయ్యాడు కార్తిక్ ఆర్యన్. మీడియా కూడా తననే టార్గెట్ చేస్తుందని ఫీల్ అయ్యాడు.
తప్పుడు ప్రచారాలు
‘‘నా తరపున మాట్లాడడానికి అసలు మనుషులు లేరు. నాకు ఇండస్ట్రీలో ఫ్యామిలీ లేదు. నాకు ఇక్కడ అంకుల్స్ లేరు, మా నాన్న, అక్క, గర్ల్‌ఫ్రెండ్.. ఇలా నా గురించి పాజిటివ్‌గా మాట్లాడడానికి ఇండస్ట్రీలో అసలు ఎవరూ లేరు’’ అని చెప్పుకొచ్చాడు కార్తిక్ ఆర్యన్. ఇక ఈ హీరో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇన్‌డైరెక్ట్‌గా నెపో కిడ్స్‌పై సెటైర్లు వేశాడని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. సాయం లేకుండా సక్సెస్‌ఫుల్ అయితే కొందరు చూసి తట్టుకోలేరు, అందుకే వారి గురించి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు అన్నాడు. నెపో కిడ్స్‌పై కార్తిక్ ఆర్యన్ చేసిన ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఇంత ఓపెన్‌గా మాట్లాడడం వల్ల తనకు సమస్యలు ఎదురవ్వక తప్పదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చిరు, బాలయ్య కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోతో బాబీ.. ఎన్‌టీఆర్ హ్యాండ్ ఉందా.?
మొదటిసారి ఆ కాంబోలో
2024 డిసెంబర్‌లో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan)తో కరణ్ జోహార్ తన ఫస్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. అదే ‘తూ మేరా మే తేరీ, మే తేరా తూ మేరీ’. ఇప్పటివరకు కార్తిక్ ఆర్యన్ ఎంత సక్సెస్‌ఫుల్ అయినా కరణ్ జోహార్ మాత్రం తనకు ఛాన్స్ ఇవ్వలేదు. అలాంటిది మొదటిసారి వీరి కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాను సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేస్తుండగా.. 2026 ఫిబ్రవరి 13న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ గురించి మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. దీంతో పాటు అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆషిఖీ 3’లో కూడా కార్తికే హీరో.