E-Paper
Advertisement

సిప్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన.. ఈ రెండింటిలో ఏ స్కీమ్ రాబడి బెటర్?

సిప్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన.. ఈ రెండింటిలో ఏ స్కీమ్ రాబడి బెటర్?
Advertisement

SIP Vs Sukanya Samriddhi Yojana Scheme: బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో వినియోగదారులు పొదుపు పథకాలను పరిశీలన చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువగా రిటర్న్స్ వచ్చే దానిపై ఫోకస్ చేస్తున్నారు. వాటిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-SIP కాగా, మరొకటి సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ రెండింటిలో ఎక్కువగా వడ్డీ వచ్చేది ఏది? ఒక్కసారి పరిశీలన చేద్దాం.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-స్టాక్ మార్కెట్ ఆధారంగా ఉంటుంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-SIP. దీర్ఘకాలంలో అధిక సంపద లక్ష్యంగా పెట్టుకున్నవారికి SIP అనువైనది. దీనిపై రాబడులు మార్కెట్ పని తీరుపై ఆధారపడి ఉంటుంది. కాకపోతే సిప్‌‌పై వచ్చే రాబడికి ఎలాంటి హామీ ఉండదు. కాలం కలిసి వస్తే రిటర్న్స్ బాగానే వస్తాయి.

Advertisement

సుకన్య సమృద్ధి యోజన పథకం. ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా కేంద్రప్రభుత్వం రూపొందించిన పొదుపు పథకం.  ప్రభుత్వ మద్దతు గల రాబడులు, పన్ను ప్రయోజనాలు, అధిక స్థాయి భద్రత ఉంటుంది. దీర్ఘకాలిక పొదుపు కోరుకునే పెట్టుబడిదారులకు ఇదీ కూడా బెటర్. ఈ రెండింటి పథకాల్లో ఏది బెటర్. దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై కొంతమంది పెట్టుబడుదారులు తర్జనభర్జన పడతారు.

వడ్డీల్లో తేడాలు గమనించవచ్చు-ఉదాహరణకు.. ప్రతి నెలా రూ. 12500 చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?  ఏడాదికి  12 శాతం చొప్పున SIP ద్వారా సుమారుగా రూ.59 లక్షలు సమ కూరే అవకాశం ఉంది. వాస్తవానికి SIP రాబడులు మార్కెట్‌తో ముడిపడి ఉంటాయి. దీనికి ఎలాంటి హామీ ఇవ్వబడవు. అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా అయితే దాదాపు రూ. 43 లక్షలను సమకూరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ఉంది. వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికంలో  సమీక్షిస్తుంది ప్రభుత్వం.

Advertisement

సుకన్య సమృద్ధి యోజన-SSY. బాలికల కోసం కేంద్రప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం. వడ్డీ రేటు ఏడాదికి 8.2 శాతం. గరిష్ట వార్షిక పెట్టుబడి రూ. 1.5 లక్షలు. 15 సంవత్సరాల పాటు అందించవచ్చు. వర్తించే నిబంధనల ప్రకారం వడ్డీ-మెచ్యూరిటీ రాబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-SIP

నెల వారీ పెట్టుబడి: రూ. 12500

పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు

మొత్తం పెట్టుబడి రూ. 22,50,000

అంచనా రాబడి ఏడాదికి 12 శాతం

అంచనా రాబడి  సుమారుగా రూ. 36,99,142

అంచనా వేయబడినది  రూ. 59,49,142

 

సుకన్య సమృద్ధి యోజన-SSY

నెలవారీ పెట్టుబడి: రూ. 12500 నుంచి లేకుంటే ఏడాదికి రూ. 1.5 లక్షలు

పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు

మొత్తం పెట్టుబడి రూ. 22,50,000

వడ్డీ రేటు ఏడాదికి  8.2 శాతం

అంచనా రాబడి  రూ. 20,68,303

అంచనా వేయబడినది రూ. 43,18,303

SIP అంచనా రూ. 59,49,142 లక్షలు కాగా, ఎస్ఎస్‌వై అంచనా  రూ. 43,18,303 లక్షలు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు రూ. 16,30,839 లక్షలు. అది  12 శాతం వార్షిక వడ్డీ వేస్తేనే. అదే పెట్టుబడి కాలంలో సుకన్య సమృద్ధి యోజన కంటే SIP ద్వారా సుమారు రూ. 16.31 లక్షలు అధికంగా సమకూరుతుందని అంచనా. దీన్ని బట్టి పెట్టుబడుదారులను సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కేవలం అంచనా మాత్రమే.

ALSO READ: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. పెళ్లిళ్ల సీజన్‌లో వరుసగా తగ్గుతున్న ధరలు.. నేటి రేట్లు ఇవే!

 

Related News

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. EPFO ​ఎందుకు ​సలహా ఇచ్చింది?

సెప్టెంబరు నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు, మూడు రోజుల సమ్మె కూడా

సినిమా థియేటర్లలో కునుకు సేవలు.. ఉద్యోగులను ఆకట్టుకున్న స్కీమ్, అన్నీ ఉచితంగానే

మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్.. ప్రయోజనాలు తెలుసా? ఎవరు పొందుతారు?

డిగ్రీ లేకపోయినా రూ.1 లక్షకు పైగా జీతం.. ఎలా సంపాదిస్తున్నాడంటే

లారీ డ్రైవర్ కుమారుడు.. కాలేజీ చదువులో ఫెయిల్.. కట్ చేస్తే రూ.800 కోట్ల కంపెనీ ఓనర్

లోన్ యాప్‌లో అప్పు తీసుకుంటున్నారా? జాగ్రత్త ఫేక్ యాప్స్‌తో ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఇక హెచ్చరిక లేబుల్స్.. కీలక ప్రతిపాదన చేసిన FSSAI!

Big Stories

Advertisement
×