BigTV English

Prana 2.0 Electric Bike Launched: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కి.మీ మైలేజ్.. ధర మాత్రం అస్సలు ఊహించలేరు..!

Prana 2.0 Electric Bike Launched: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కి.మీ మైలేజ్.. ధర మాత్రం అస్సలు ఊహించలేరు..!

Prana 2.0 Electric Bike Price: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. కొత్త కొత్త వాహనాలు ఎలక్ట్రికల్ రూపంలో దర్శనమిస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఆటో మొబైల్ మార్కెట్ దిన దినాన అభివృద్ధి చెందుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరగడంతో వాటి ఖర్చును ఆదా చేసుకునేందుకు వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్లనే దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌కి డిమాండ్ పెరిగింది.


అందులోనూ స్కూటర్లు, కార్ల తర్వాత ఎలక్ట్రిక్ బైక్‌లపై ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీలు అధిక మైలేజీనిచ్చే బైక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవలే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తన లైనప్‌లో తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసి ఆకట్టుకుంది. ‘ఓలా రోడ్‌స్టర్’ పేరుతో ఓ బైక్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి పోటీగా మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లోకి దర్శనమిచ్చింది.

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల్లో శ్రీవారు మోటార్స్ సంస్థ ఒకటి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘ప్రాణా’ ఎలక్ట్రిక్ బైక్ సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. కంపెనీ దీనిని 2021లో భారత్‌లో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ బైక్‌ను పూర్తిగా మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చింది. తాజాగా దీనిని ‘ప్రాణా 2.O’ పేరుతో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో తీసుకువచ్చింది.


Also Read: అప్‌డేటెడ్ ఫీచర్లతో సిట్రోయెన్​ సీ3.. ధరలు పెరిగాయ్.. ఎంతంటే..?

కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక లక్ష్యంతో అప్డేట్‌ చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 10 వేల ప్రాణా 2.O ఎలక్ట్రిక్ బైక్‌ల యూనిట్లను సేల్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా సింగపూర్, మలేషియాతో పాటు ఆసియా దేశాలకు కూడా తమ ఎలక్ట్రిక్ బైక్‌లను ఎగుమతి చేయాలని భావిస్తుంది. కాగా ప్రాణా ఎలక్ట్రిక్ బైక్ అనేది ఆ కంపెనీ నుంచి వచ్చిన తొలి ప్రొడక్ట్‌గా ఉంది. ఇక ఇప్పుడు సరికొత్త అప్డేట్‌లతో వచ్చిన ప్రాణా 2.O ఎలక్ట్రిక్ బైక్ ధర, మైలేజ్, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

ప్రాణా 2.O ఎలక్ట్రిక్ బైక్ మొత్తం రెండు వేరియంట్లలో వచ్చింది. అందులో గ్రాండ్, ఎలైట్ అనే ఆప్షన్‌లు ఉన్నాయి. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందించారు. వాటిలో ఒకటి 5.0 కిలోవాట్ల బ్యాటరీ. దీనికి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే 150 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. అంతేకాకుండా ఇది గంటకు 123 కి.మీ స్పీడ్‌తో పరుగులు పెడుతుంది. దీని ధర విషయానికొస్తే.. కంపెనీ దీనిని రూ.2.55 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ (చెన్నై) ధరతో లాంచ్ అయింది.

ఇందులో ఎలైట్ వేరియంట్ అనేది ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌గా ఉంది. అధిక మైలేజీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ రేంజ్ అందించడానికి 8.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. తద్వారా దానికి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 250 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. కంపెనీ దీని ధరను రూ.3.20 లక్షలుగా నిర్ణయించింది. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ప్రాణా 2.O ఎలక్ట్రిక్ బైక్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో జీపీఎస్ సదుపాయంతో డిజిటల్ స్పీడోమీటర్‌ను అందించారు. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ప్రాక్టీస్, డ్రైవ్, స్పోర్ట్స్, రివర్స్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Related News

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Big Stories

×