E-Paper
Advertisement

KL Rahul: అప్పుడే రిటైర్మెంటా? అదంతా ఫేక్: కేఎల్ రాహుల్

KL Rahul: అప్పుడే రిటైర్మెంటా? అదంతా ఫేక్: కేఎల్ రాహుల్
Advertisement

KL Rahul is on his Retirement: టీమిండియా కీలక ఆటగాడైన కేఎల్ రాహుల్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పారేశాడు. ఎవరు ఇలాంటివి షేర్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. నిఖిల్ కామ‌త్ అనే యూట్యూబ‌ర్‌తో మాట్లాడిన రాహుల్.. తన రిటైర్మెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

అసలే శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై జనం షాక్ నుంచి కోలుకోలేదు. అలాంటిది ఒకేరోజు ఇద్దరు ప్రముఖ క్రికెటర్లు రిటైర్మెంట్ అనేసరికి అభిమానుల గుండెలు పగిలాయి. మొత్తానికి కేఎల్ రాహుల్ స్పందించాడు. అసలు విషయం చెప్పాడు.

Advertisement

నేనేమీ రిటైర్మెంట్ ప్రకటించలేదు, వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పారేశాడు. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఈ రిటైర్మెంట్ కూడా అలాంటి భయాన్నే కల్పించిదని అన్నాడు. ఇంతకీ ఏమిటా సంఘటన అంటే.. 2019లో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంకి హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ కూడా వెళ్లాడు.

Also Read: కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు, రోహిత్ బ్యాట్ రూ.24 లక్షలు

Advertisement

అయితే.. ఇద్దరూ ఆడవాళ్లని కించపరిచేలా మాట్లాడారు. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. బీసీసీఐ కూడా సీరియస్ అయ్యింది. ఇద్దరిని కొన్ని రోజులు సస్పెండ్ చేసింది. తర్వాత వివాదం సద్దుమణిగింది. కానీ ఆ ఘటన నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉందని అన్నాడు. అది మళ్లీ గుర్తు వచ్చి భయపెట్టిందని రాహుల్ అన్నాడు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం నుంచి చాలా నేర్చుకున్నానని, జీవితం విలువ తెలిసిందని అన్నాడు.

నా జీవితంలో ఎప్పుడూ సస్పెండ్ కాలేదు. అంటే స్కూల్, కాలేజ్ ఇలా ఎక్కడా కూడా కానీ బీసీసీఐ సస్పెండ్ చేసేసరికి తట్టుకోలేకపోయాను. ఆ ఒక్క ఇంటర్వ్యూ కారణంగా భారత జట్టులో స్థానం కోల్పోయాను. అప్పుడు మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపాడు. మళ్లీ ఆ రోజులు ఇప్పుడు గుర్తొచ్చాయని అన్నాడు.

అయితే.. యోగా లాంటివి సాధన చేశాను. అలా నెగిటివ్ ను పాజిటివ్ గా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి వివాదాలకు చాలా దూరంగా ఉంటున్నాను. కానీ ట్రోలింగ్ లు మాత్రం ఆగలేదని అన్నాడు. త్వర‌లో జ‌రగబోయే దులీప్ ట్రోఫీలో పరుగులు చేసి, తనేమిటో నిరూపించుకోవాలని నెట్స్ లో కఠిన సాధన చేస్తున్నాడు. రాహుల్ మళ్లీ ఫామ్ ని అందుకోవాలని మనం కూడా కోరుకుందాం.

Related News

వెండి బతుకమ్మపై ట్రోల్స్…పళ్లు రాలగొడతానంటూ పీవీ సింధూ హెచ్చరిక ?

గాయాలు లేకుండా క‌పిల్ దేవ్ ఇర‌గ‌దీస్తే..బుమ్రా, పాండ్యా జ‌ల్సాలు చేస్తున్నారు!

డారెన్ సామీ లాంటి పాకిస్తాన్ కుక్క‌ల‌ను ఇండియా నుంచి తరిమి కొట్టండి!

నిద్ర‌పోయి రెండు రోజులైంది…పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌పై RCB ప్లేయ‌ర్ పోస్ట్ వైర‌ల్ !

CJP, ధ్రువ్ రాఠీకి మ‌ద్ద‌తుగా కోహ్లీ ఫ్యామిలీ..షాకింగ్ పోస్టులు వైర‌ల్ ?

షమీ వ‌న్డేల‌కు సెల‌క్ట్ కాలేద‌ని న్యూజిలాండ్ పండ‌గ చేసుకుంటోంది

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

Big Stories

Advertisement
×