BigTV English

Startups-ecommerce: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం.. భారీ ప్యాకేజీలతో కంపెనీలు

Startups-ecommerce: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం.. భారీ ప్యాకేజీలతో కంపెనీలు

Startups-E commerce: నైపుణ్యమున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లపై ఫోకస్ చేశాయి అంకుర సంస్థలు, ఈ కామర్స్ కంపెనీలు. శక్తి సామర్థ్యాలున్న వారి కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కంపెనీకి ఉపయోగపడారని భావిస్తున్నాయి.. కోట్లలో వారికి వార్షిక ప్యాకేజీని అందజేస్తున్నాయి.


ఆదివారం నుంచి ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్ సీజన్ మొదలైంది. 10 లక్షల నుంచి కోటి వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రాడ్యుయేట్లు ఇంటర్నెషిష్ ప్రాజెక్టులు చేసిన అంకుర సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు కూడా అందులో ఉన్నాయి.

ముఖ్యంగా ఐఐటీలు, బిట్స్, ఎన్ఐటీ, ఐఐఎస్సీ, ఐఐఐటీలు వంటి టాప్ కాలేజీలకు వెళ్లి రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక్కడి నుంచి సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, డేటా సైన్స్, అనలిటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వాటిలో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇలా దేశంలోని అన్ని ఐఐటీలకు వెళ్తున్నాయి ఆయా కంపెనీలు.


క్విక్ సెల్, ఇండస్ ఇన్ సైట్స్, గ్రో, విన్ జో, కార్స్ 24, నో బ్రోకర్, ఓలా, మీషో, గేమ్స్ క్రాఫ్ట్, మైల్యాప్స్, ఫోన్ పే లాంటి సంస్థలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒక్కో కంపెనీ వారి అవసరాలకు అనుగుణంగా టాలెంట్‌ను పసిగట్టి వారికి వేతనాలు ఇస్తున్నాయి.

ALSO READ:  నామినీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. కొత్తగా అమల్లోకి వచ్చిన బ్యాంకింగ్ రూల్స్ ఇవే!

రీసెంట్‌గా మద్రాస్ ఐఐటీకి వెళ్లిన యూఎస్ ట్రేడింగ్ కంపెనీ ఓ విద్యార్థికి ఏకంగా రూ. 4.3 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. అయితే ఆ స్టూడెంట్ ఆ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయడంతో టాలెంట్‌ని పసిగట్టి ఆ స్థాయిలో ప్యాకేజీ ఇచ్చిందని అంటున్నారు. పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల అవకాశాలు ఈ విధంగా వస్తాయన్నది కొందరి మాట.

దేశంలోని టాప్ కాలేజీల తర్వాత వివిధ రాష్ట్రాల్లోని కాలేజీలపై దృష్టి పెట్టనున్నాయి. కేవలం సాప్ట్‌వేర్ వైపు కాకుండా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×