E-Paper
Advertisement

తప్పుడు వార్తలొద్దు.. ఇదిగో రుణాల వ్యవహారం, చిట్టా విప్పిన సుభాష్‌చంద్ర

తప్పుడు వార్తలొద్దు.. ఇదిగో రుణాల వ్యవహారం, చిట్టా విప్పిన సుభాష్‌చంద్ర
Advertisement

Subhash Chandra: తన వ్యక్తిగత రుణ పరిష్కార అంశంపై వస్తున్న అసత్య వార్తలను ఖండించారు మాజీ ఎంపీ, ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ సుభాష్ చంద్ర. తాను ఎవరి వద్ద వ్యక్తిగతంగా రుణం తీసుకోలేదని తేల్చేశారు. వివాదంలో ఉన్న క్లెయిమ్ రూ. 22 వేల కోట్లు కాదన్నారు. కేవలం రూ. 3,992 కోట్లని తేల్చేశారు. దీనికి సంబంధించి ఆయన ఆఫీసు అధికారిక నోట్ విడుదల చేసింది.

 

తప్పుడు వార్తలొద్దు.. చిట్టా విప్పిన సుభాష్‌చంద్ర

Advertisement

ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు సుభాష్‌చంద్ర దివాలా ప్రక్రియలో రుణదాతలు పేర్కొన్న రూ.22,006 కోట్ల క్లెయిమ్‌లకు కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌-ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపిందనే దానిపై జోరుగా వార్తలు వస్తున్నాయి. అన్ని బిజినెస్ ఛానెళ్లలో ఈ తరహా వార్తలు జోరందుకోవడంతో సుభాష్‌ చంద్ర స్పందించారు. వ్యక్తిగత దివాలా ప్రక్రియలో తనపై ఉన్న క్లెయిమ్‌ కేవలం రూ.3,992 కోట్లని వెల్లడించారు. అయితే తాను వ్యక్తిగత హామీదారుడ్ని మాత్రమేనన్నారు.

 

రుణాల వ్యవహారంపై వివరాలు వెల్లడించిన సుభాష్‌చంద్ర

Advertisement

ఏ రుణదాత వద్ద డబ్బు అప్పుగా తీసుకోలేన్నారు. రూ.3992 కోట్లలో రూ.620 కోట్లకు సంబంధించి క్లెయిమ్‌ ఇప్పటికే పరిష్కారమైందని ఆయన కార్యాలయం వెల్లడించింది. మరో రూ.1,063 కోట్లు తిరిగి చెల్లించేందుకు రుణం తీసుకున్న సంస్థలు ముందుకొచ్చాయని వివరించారు. వ్యక్తిగత హామీలతో రుణాలు తీసుకున్న సంస్థలు ఇప్పటి వరకు రూ.43,000 కోట్లు చెల్లించాయని, ఇతర మొత్తాలను పరిష్కరిస్తామని ఆయా సంస్థలు హామీ ఇచ్చాయనన్నారు. వివేక్‌ ఇన్‌ఫ్రాకాన్‌ సంస్థ తీసుకున్న రూ.170 కోట్లు నిరర్థక ఆస్తిగా మారడంతో కేసు నమోదైందని, ఈ రుణానికి సుభాష్‌ వ్యక్తిగత హామీ ఇచ్చారని తెలిపింది. రుణదాత ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించి దివాలా ప్రక్రియ ప్రారంభమైందని, ఆయన నుంచి డబ్బులు రావాల్సిన ఇతర సంస్థలు జత కలిశాయన్నారు.

ఫలితంగా క్లెయిమ్‌లు రూ.22,006 కోట్లకు చేరాయని, అందులో ఎస్సెల్‌/జీ నెట్‌వర్క్‌ సంబంధిత కంపెనీలు తీసుకున్న రుణాలకు పూచీగానున్న కేసులున్నాయని వివరించారు. రిజల్యూషన్ ప్రొఫెషనల్- RP ఓటింగ్‌ సమయంలో ఈ ప్రణాళికకు 80.814 శాతం మంది రుణదాతలు మద్దతు తెలిపారని, మిగిలిన 19.186 శాతం ఓటింగ్‌కు సమయం ఇచ్చినా తమ ఓటు నమోదు చేయలేదన్నారు. రుణదాతలలో కొందరు ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ NCLTలో అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. ఆ తర్వాత మిగిలినవారు వారితో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు.

ALSO READ: హోటల్‌కు వెళ్తున్నారా? స్టే కోసం నో ఆధార్ జెరాక్స్, కొత్త రూల్స్ వచ్చేశాయి

Related News

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

Big Stories

Advertisement
×